
మొబైల్ కొనడానకి వేలల్లో ఖర్చు చేస్తారు. కానీ, టెంపర్డ్ గ్లాస్ మాత్రం చౌకైనది వాడుతుంటారు. దీనివల్ల క్రమంగా మీ ఫోన్ డిస్ ప్లే పెర్ఫామెన్స్ తగ్గిపోవడమే కాదు, స్క్రీను కు ఎలాంటి ప్రొటెక్షన్ లభించదు. అసలు టెంపర్డ్ గ్లాస్ ఎలా ఉండాలి? దాన్ని ఎలా వాడాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు రకాలు
రోడ్డు పక్కన దొరికే చౌకైన టెంపర్డ్ గ్లాస్ వల్ల మీ మొబైల్ స్క్రీన్ కు మరింత నష్టం కలుగుతుంది. ముఖ్యంగా టెంపర్డ్ గ్లాస్ ల్లో రెండు రకాలున్నాయి. గాజు, ప్లాస్టిక్ ఇవి రెండూ మంచివే. అయితే గ్లాస్ రకాన్ని బట్టి, డిస్‌ప్లే క్వాలిటీ, టచ్ క్వాలిటీ మారుతుంటుంది. ముఖ్యంగా రూ. 100 ఖరీదు చేసే టెంపర్డ్ గ్లాసులు స్మూత్ సర్ఫేస్ ను కలిగి ఉండవు. వాటిపై త్వరగా గీతలు పడతాయి. వేలిముద్రలను కూడా ఆకర్షిస్తాయి. వీటిపై జిడ్డు పడితే క్లీన్ చేయడం కష్టం. వీటివల్ల మీ మొబైల్ వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్స్ దెబ్బతింటుంది.
టచ్ సెన్సిటివిటీ
నాసి రకం స్క్రీన్ గార్డులను గట్టిగా ఉంచడం కోసం ఎక్కువగా మందంగా తయారుచేస్తారు. గ్లాస్ ఎంత మందంగా ఉంటే స్క్రీన్ టచ్ సెన్సిటివిటీ అంత తగ్గిపోతుంది. తద్వారా ఫోన్ పై టచ్ చేసేటప్పుడు తెలియకుండానే ఎక్కువ ప్రెజర్ తో టచ్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల రానురాను మీ ఫోన్ టచ్ సెన్సివిటి తగ్గిపోయే అవకాశమంది.
డిస్‌ప్లే క్వాలిటీ
తక్కువ ధరలో లభించే ప్లాస్టిక్ టెంపర్డ్ గ్లాస్ లు బలంగా, స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ, ఇవి ఫోన్ డిస్ ప్లే లోని కలర్స్ క్వాలిటీని తగ్గిస్తాయి. అలాగే స్క్రీన్ బ్రైట్ నెస్ ను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. దీనివల్ల మీరు సినిమాలు చూస్తున్నప్పుడు సరైన ఎక్స్ పీరియెన్స్ ను పొందలేరు. మొబైల్ లో ఉండే ఒరిజినల్ డిస్ ప్లే క్వాలిటీని కొంత కోల్పోవాల్సి వస్తుంది.
కర్వ్‌డ్ స్క్రీన్స్‌కు..
చౌకగా లభించే స్క్రీన్ గార్డ్ లు కర్వ్ డ్ స్క్రీన్స్ కు పనికిరావు. ఇవి స్క్రీన్ అంచుల్లో సరిగ్గా అతుక్కోవు, ఊరికే ఊడిపోతుంటుంది. తద్వారా స్క్రీన్ పై బబుల్స్ పడే అవకాశం ఉంది. వీటిని తొలగించడం చాలా కష్టం. మొత్తం స్క్రీన్ గార్డ్ ను తీసేసి కొత్తది వేసుకోవాల్సి వస్తుంది.
ఇలాంటివే వాడాలి
- మీ మొబైల డిస్ ప్లే అందించే ఫుల్ క్వాలిటీని ఎక్స్ పీరియెన్స్ చెయాలంటే కాస్త మెరుగైన టెంపర్డ్ గ్లాస్ వాడాలి. అలాగే టచ్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండే గ్లాస్ ఎంచుకోవాలి.
- మొబైల్ కోసం ఎప్పుడూ ఒరిజినల్ లేదా బ్రాండెడ్ టెంపర్డ్ గ్లాస్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి.
- మీ ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటే ఎడ్జ్ లేదా 3D గ్లాస్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి.
- టెంపర్డ్ గ్లాస్ కు కనీసం 99 శాతం ట్రాన్స్ పరెన్సీ రేటు ఉండాలి. ఇలా ఉంటే డిస్‌ప్లే బ్రైట్ నెస్, కలర్ క్వాలిటీలో మారకుండా ఉంటుంది.
- టెంపర్డ్ గ్లాస్ అనేది 0.3మి.మీ కంటే ఎక్కువ మందంగా ఉండకూడదు. అలా ఉంటే టచ్ స్పీడ్ తగ్గుతుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..