Mobile Hanging: మీ మొబైల్ ఊరికే స్లో అవుతుందా? ఇలా చేసి చూడండి!

Mobile Hanging: మీ మొబైల్ ఊరికే స్లో అవుతుందా? ఇలా చేసి చూడండి!


Mobile Hanging: మీ మొబైల్ ఊరికే స్లో అవుతుందా? ఇలా చేసి చూడండి!

మొబైల్ లో యాప్స్ సరిగ్గా పని చేయకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఒకటి మొబైల్ సాఫ్ట్ వేర్.. యాప్స్ లోడ్ ను భరించలేకపోవచ్చు. లేదా యాప్స్ లో బగ్స్ ఉండి ఉండొచ్చు. వీటిని ఎలా సరిచేయాలో ఇప్పుడు చూద్దాం.

స్టోరేజ్ ఫుల్

మొబైల్ ఊరిగే స్లో అవుతుంటే మీ సాఫ్ట్‌వేర్.. యాప్స్‌ను రన్ చేయలేకపోతుండొచ్చు. దీనికోసం ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ లో ఏ యాప్ ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుందో చూడాలి. ఆ యాప్స్‌ను ఫోర్స్‌స్టా్ప్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసి చూడాలి. ఇప్పుడు మొబైల్ సరిగ్గా పని చేస్తుంటే ప్రాబ్లమ్ సాఫ్ట్‌వేర్‌‌లో ఉందని అర్థం. మీ సాఫ్ట్‌వేర్ ఎక్కువ యాప్స్‌ను ఒకేసారి ప్రాసెస్ చేయలేకపోతోంది. కాబట్టి పెద్ద యాప్స్‌ను తీసివేయడం లేదా ఓవరాల్‌గా తక్కువ యాప్స్ ఉండేలా చూసుకోవడం చేయాలి.

యాప్ అప్‌డేట్

మొబైల్ మొత్తం కాకుండా ఏదైనా ఒక యాప్ మాత్రం స్లో అవుతుందంటే.. ఆ యాప్ అప్ టు డేట్ ఉందో లేదో చెక్ చేయాలి. యాప్ డెవలపర్లు ఎప్పటికప్పుడు వాటిలో వచ్చే బగ్స్‌ను సరి చేస్తుంటారు. అందుకే యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలి. ఇలా చేస్తే యాప్ స్లో అవ్వకుండా చూసుకోవచ్చు.

రీబూట్

మొబైల్ స్లో అవ్వడానికి మొబైల్ సాఫ్ట్ వేర్ లో ఏదైనా ఎర్రర్ కూడా కారణమవ్వొచ్చు . కాబట్టి హ్యాంగ్ అవుతున్నప్పుడు ఒకసారి ఫోన్ రీబూట్ చేసి చూడాలి. మొబైల్ స్విచాఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. ఇలా చేస్తే మొబైల్‌లోని ఎర్రర్లన్నీ క్లియర్ అవుతాయి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

యాప్ అప్ డేట్స్ తో పాటు మొబైల్ ఓఎస్ కూడా అప్ టు డేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లో అప్ డేట్స్‌లోకి వెళ్లి  ‘సిస్టమ్‌ అప్‌డేట్స్‌’ చెక్ చేయాలి. అక్కడ అప్ డేట్స్ ఉంటే వెంటనే డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

యాప్స్ క్యాచీ

యాప్స్ తరచూ స్లో అవ్వడానికి క్యాచీ లేదా యాప్ డేటా నిండిపోవడం కూడా కారణమవ్వొచ్చు. దాన్ని క్లియర్ చేయడం కోసం యాప్‌పై నొక్కి పట్టుకుని.. ‘యాప్‌ ఇన్ఫో’లోకి వెళ్లాలి. అందులో ‘స్టోరేజ్‌ యూసేజ్‌’లోకి వెళ్లి ‘క్లియర్‌ క్యాచీ’పై క్లిక్‌ చేయాలి.

ఫ్యాక్టరీ రీసెట్

ఈ ట్రిక్స్ ఏవీ పని చేయకపోతే మొబైల్‌లో ఏదైనా ఇతర సాఫ్ట్‌వేర్ ఎర్రర్ ఉండి ఉండొచ్చు. అప్పుడు ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఒక్కటే ఆప్షన్. ఇలా చేయడం ద్వారా యాప్స్, గూగుల్ అకౌంట్స్, స్టోరేజ్ అంతా డిలీట్ అవుతాయి. మొబైల్ కొత్తదానిలా మారిపోతుంది. ఇది కూడా పని చేయకపోతే మొబైల్ లో ఏదైనా ఫిజికల్ ఎర్రర్ ఉండే అవకాశం ఉంటుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *