
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి కోర్టు కొన్ని షరత్తులు విధించింది. వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరుకావాలని, అలాగే రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. కాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు( మంగళవారం) మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గత జులై 20వ తేదీన ఏపీ లిక్కర్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అప్పటి నుంచి అంటే గత 71 రోజులుగా మిథున్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు రానున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.