తేజ సజ్జా హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 5 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మిరాయ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియ మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది. వీరితో పాటు జగపతి బాబు, జయరాం, గెటప్ శీను, సంజయ్ కపూర్, రఘురామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. అయితే మిరాయ్ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు కూడా కనిపించారు. నేను శైలజ, చిత్రల హరి వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమలతో పాటు కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా మిరాయ్ లో కనిపించారు. వీరిద్దరిలో ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్‌గా, మరొకరు అతని బాస్‌గా కనిపించారు. ముఖ్యంగా సీఐ అశోక్ పాత్రలో కిశోర్ తిరుమల కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యింది. భయపడుతూనే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడీ క్రేజీ డైరెక్టర్. స్క్రీన్ మీద కిశోర్ తిరుల కనిపించిన ప్రతిసారీ ఆడియన్స్ నవ్వారంటే.. ఈ డైరెక్టర్ లోనూ యాక్టింగ్ ట్యాలెంట్ ఉందని అర్థం చేసుకోవచ్చు.
నేను మీకు తెలుసా, సెకెండ్ హ్యాండ్, పవర్, కరెంట్ తీగ, రఘు వరన్ బీటెక్, శివమ్ తదితర సినిమాలకు మాటలతో పాటు పాటలు రాశాడు కిశోర్ తిరుమల. ఇక నేను శైలజా సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, చిత్రల హరి, రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా గుర్తింప తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి
మిరాయ్ సినిమాలో డైరెక్టర్లు కిషోర్ తిరుమల, వెంకటేశ్ మహా..
Dahaa entry 144p 🤣🤣🤣🤣
Surprise Cameo Kishore Tirumala 😂 https://t.co/5f6gCH0A1Z— Dhilli_Surhhhhhhii (@Dilli_Suri) September 16, 2025
ఇక కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు వెంకటేశ్ మహా. ఓ వైపు డైరెక్టర్ గా మెరుస్తూనే సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.