మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ సైతం ఒకే చేస్తున్నారు. బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా..మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా గురించి నిత్యం ఏదోక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయిక ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమాలో చిరు జోడిగా అనుష్కను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నరాట బాబీ. ఇప్పటికే ఈ మూవీ స్టోరీని అనుష్కకు చెప్పగా.. ఆమె పాజిటివ్ గా స్పందించిందని టాక్. ఇప్పటికే నాగార్జున, వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుష్క.. ఇప్పుడు చిరుతో సైతం కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇదిలా ఉంటే.. ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ యాక్షన్ సీన్లలో అనుష్క అదరగొట్టింది. ఇక ఇప్పుడు చిరుతో ఈ బ్యూటీ ప్రాజెక్ట్ చేయనుండడంతో అంచనాలు తీవ్రస్థాయిలో ఏర్పడ్డాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?