Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..


సాధారణంగా సినీరంగంలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి జనాలకు దగ్గరయ్యారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో బాలనటీనటులుగా నటించి ఆ తర్వాత ఆ స్టార్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. అతర్వాత చిరుకు చెల్లెలిగా కనిపించింది ఓ హీరోయిన్. పైన ఫోటోను చూశారు కదా.. ? ఆ సీన్ పసివాడి ప్రాణం సినిమాలోనిది. చిరు కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పసివాడి ప్రాణం. ఈ సినిమాలోచైల్డ్ ఆర్టిస్టుగా నటించిన కుర్రాడు గుర్తున్నాడా.. ? అమాయకత్వంతో అప్పట్లో జనాలను ఆకట్టుకున్నాడు. కానీ అతడు అబ్బాయి కాదు.. అమ్మాయి.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో కనిపించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదండి.. బుల్లితెర ఫేమస్ హీరోయన్ సుజిత. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె సూపర్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలోల అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే ఉంది. తెలుగులో సుందరకాండ, వదినమ్మ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె తమిళంలో పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే షాలకు యాంకరింగ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇదిలా ఉంటే.. పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన సుజిత.. ఆ తర్వాత చిరుకు చెల్లిగా కనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిన సుజిత.. చిరంజీవి నటించిన జై చిరంజీవా చిత్రంలో చిరుకు చెల్లిగా కనిపించింది. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. ఆ తర్వాత చెల్లిగా నటించింది సుజిత.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత.. తనకు పసివాడి ప్రాణం తర్వాత మరో ఐదారు చిత్రాల్లోనూ అబ్బాయి పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయని గుర్తుచేసుకుంది. పసివాడి ప్రాణం సినిమాలో యాక్టింగ్ తనకు అంతగా గుర్తు లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *