మకరం: ఈ రాశికి అత్యంత శుభులైన శుక్ర, శనులు తృతీయంలో కలుస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.