Maoists: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 70 మంది లొంగుబాటు.. ఎక్కడంటే..

Maoists: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 70 మంది లొంగుబాటు.. ఎక్కడంటే..


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దంతేవాడలో లో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు వాళ్లు లొంగిపోయారు. ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టులలో 50మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు..వీరిలో 30 మందిపై రూ.64లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే తమ ఉద్దేశమని.. జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ఇటీవల నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్‌ వికల్ప్ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే.. చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడం సంచలనంగా మారింది. కాగా.. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై సంచలన ట్వీట్‌ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. అగ్రనాయకులను ఏరివేశామని.. మిగతా వాళ్లని కూడా అంతం చేస్తామని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *