
మంచు మనోజ్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించిన అప్‌డేట్‌ను షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా
Mahesh Babu: అల్లు అర్జున్ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??
గ్యాస్ ఎఫెక్ట్.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్
Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు