Manchu Manoj: ‘మిరాయ్’ గ్రాండ్ సక్సెస్‌.. అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న మంచు మనోజ్.. ఫొటోస్ ఇదిగో

Manchu Manoj: ‘మిరాయ్’ గ్రాండ్ సక్సెస్‌.. అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న మంచు మనోజ్.. ఫొటోస్ ఇదిగో


ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా మిరాయ్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించారు. అలాగే యంగ్ హీరో తేజ సజ్జా, రితిక నాయక్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తన కొత్త సినిమా “మిరాయ్” ఘన విజయం నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి.. శ్రీరాముడిని దర్శించుకున్నారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. అయోధ్య నుంచే మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ ను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ వెల్లడించారు. మొదట హనుమాన్ గఢీని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్…ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ “అయోధ్య రావాలనేది నా కల. ఇప్పుడు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అమవాస్య రోజు దర్శనం మంచిదని స్వామిజీలు చెప్పారు. శ్రీరాముడు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించి ఈ పుణ్యక్షేత్రం రావడం సంతోషంగా ఉంది. దర్శనం అద్భుతంగా జరిగింది. మరోసారి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వస్తాను. మీరంతా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నా.

ఇవి కూడా చదవండి

అయోధ్యలో మంచు మనోజ్..

రామాయణ ఇతిహాసం స్ఫూర్తి మా మిరాయ్ మూవీ కథలో ఉంది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పాత్రలో నటించాను. అశోకుడు 9 గ్రంథాల్లో రాసిన రహస్యాలు తెలుసుకుని బ్లాక్ స్వార్డ్ శ్రీరాముడిని ఎదుర్కొనే రావణుడిగా మారతాడు. ఈ పాత్రలో నటించినందుకు శ్రీరాముడికి క్షమాపణలు చెప్పుకున్నా. మా మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ అయోధ్య నుంచే ప్రారంభమవుతోంది. శ్రీరాముడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

మంచు మనోజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *