Headlines

Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’

Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’


హీరోయిన్ మమతా మోహన్ దాస్! ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆమె నటిగా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడింది. రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడిన ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది మమతా..! యమదొంగ సినిమా కంటే ముందు తనకు తెలుగులో ఓ సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పిన మమతా మోహన్ దాస్.. ఆ సినిమా మరేదో కాదు.. అరుంధతి సినిమా అంటూ చెప్పి షాకిచ్చింది. మల్లెమాల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తాను సైన్ చేద్దామని మొదట అనుకున్నప్పటికీ… ఆ ప్రొడక్షన్ హౌస్ అంత మంచిది కాదని.. తన మేనేజర్ చెప్పడంతో ఆ సినిమా చేసేందుకు తాను ఒప్పుకోలేదంటూ మమతా చెప్పుకొచ్చింది. అరుంధతి సినిమాలో నటించాలని రెండు మూడు నెలలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడుగుతూనే ఉన్నారని.. కానీ ఆయన మాటలు తాను పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ఆ ఏడాది తర్వాత రాజమౌళి ఫోన్ చేసి యమదొంగ సినిమా ఛాన్స్ ఇచ్చారని.. ఆడియషన్స్‌తో భాగంగా.. తొలి సారి ఆయనను కలిసినప్పుడు.. ‘అరుంధతి సినిమాను వదులుకోకుండా నువ్వు చేయాల్సింది. పెద్ద తప్పు చేశావు అని అన్నారని గుర్తు చేసుకుంది. అంత పెద్ద డైరెక్టర్ అలా అనడంతో తన గుండె పగిలిపోయింది అంటూ మమతా మోహన్ దాస్ కాస్త ఎమోషనల్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్

Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు

‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??

Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *