Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు..


కర్నాటక యాద్గిరి జిల్లాలో స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు, ముఖం చూసి.. పేరు, తల్లిదండ్రులు పేర్లు, ఫోన్ నంబర్ చెప్పగలను అంటూ బీరాలు పలుకుతూ హడావిడి పర్సన్ మల్లికార్జున ముత్యాకు మూడింది. తాజాగా ఆయనపై పోక్సో కేసు నమోదైంది. బాలికతో అనుచితంగా ప్రవర్తించారంటూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో శహపుర తాలూకా గోగి పోలీస్ స్టేషన్‌లో ముత్యాపై కేసు నమోదు చేశారు. బాలికతో అతను ఇబ్బందికరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో వైరల్ అవుతున్నాయి. అతను చిన్నారితో అసభ్యంతో ప్రవర్తిస్తున్న సమయంలో చుట్టూ చాలామంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా అతనికి అడ్డు చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు బాలల రక్షణ కమిషన్‌ కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. పోలీసుల నుంచి పూర్తి రిపోర్ట్ తెప్పించుకుంది.

అయితే ఘటనపై ముత్యా వివరణ ఇచ్చాడు. తాను ఆ బాలికను కుమార్తెలా భావించి.. సరదాగా ఆట పట్టించినట్లు చెప్పుకొచ్చాడు. తనకు ఏ చెడు ఉద్దేశం లేదని.. ఒక కుమార్తెను తండ్రి చూసేలా.. తాను ఆ చిన్నారిని చూసినట్లు వివరించాడు. దీనిపై పోలీసులు ఆదేశిస్తే.. విచారణకు హాజరు అవుతానన్నారు.  భక్తులు ‘అప్పాజీ’  అని పిలిచుకునే ముత్యా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన తెలంగాణలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా మల్లికార్జున ముత్యా బాలిక శరీరాన్ని తాకుతూ డ్యాన్స్‌ చేయడం, ముక్కు పిండడం,  గొంతు పట్టుకుని మంచం మీదకు తోయడం వంటివి వైరల్‌గా మారిన వీడియోల్లో ఉన్నాయి. ఆ పాప మైనర్ కనుక.. తన డీటేల్స్, ఫోటోలు, వీడియోలు వైరల్ చేయొద్దని టీవీ9 తెలుగు బాధ్యతాయుతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తోంది.

Also Read: తక్కువ ఖర్చుతో కోళ్లకు మేతగా పురుగులు ఇలా తయారు చేస్కోండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *