
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2017లో రిలీజైన చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టాడు. భరత్, ప్రియదర్శి, ఆర్జే బాలాజీ, దీప రామానుజం, జయప్రకాశ్, నాగినీడు, షయాజీ షిండే, హిమజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్నపాప కనిపిస్తుంది. సినిమాలో తను కనిపించేది కొద్ది సేపే అయినా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే ఆ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ తర్వాతి కాలంలోనే మహేష్ బాబుతో కలిసి ఒక యాడ్ లోనూ నటించింది. ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ, బిజీగా ఉంటోంది. ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన లిటిల్ హార్ట్స్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఇక సోషల్ మీడియాలోనూ తను బాగా ఫేమస్. ఇంతకీ ఆ ఛైల్డ్ ఆర్టిస్ట్ పేరెంటో తెలుసా? బేబీ మదిహ నస్రీన్. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మహేష్ బాబుతో కలిసి డెన్వర్ పర్‌ఫ్యూమ్ యాడ్ షూట్ లోనూ పాల్గొంది మదిహ. అలాగే తను ఇప్పటివరకు మొత్తం 42 సినిమాల్లో నటించిందట. అలాగే38 సీరియల్స్ లో యాక్ట్ చేసిందట. ఈ విషయాన్ని తన బయోలో చెప్పుకొచ్చింది నస్రీన్. అయితే ఈ మధ్యన నస్రీన్ బాగా ఫేమస్ అయ్యింది మాత్రం లిటిల్ హార్ట్స్ సినిమాతోనే. ఇందులో ఆమె హీరోయిన్ శివానీ నాగారం చెల్లులు నీలు పాత్రలో కనిపించింది. అంతకు ముందు ఓదెల 2, శివన్, నిహారిక సూర్య కాంతం, సైరా నరసింహారెడ్డి, మహేష్ బాబు భరత్ అనే నేను, సాక్ష్యం, విశ్వాసం, శైలజా రెడ్డి అల్లుడు తదితర సినిమాలోనూ యాక్ట్ చేసి మెప్పించింది. అలాగే కోయిలమ్మ, తేనే మనసులు లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది.
లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో మదిహ..
View this post on Instagram
ఇక సోషల్ మీడియాలోనూ మదిహకు మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.