Mahesh- Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా… కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. పుష్ప కాదు..

Mahesh- Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా… కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. పుష్ప కాదు..


మహేష్ బాబు, అల్లు అర్జున్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరు హీరోలకు ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులూ ఉన్నారు. ఇక క్రేజ్ పరంగా కూడా ఇద్దరికి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉంది. అయితే చాలా మంది హీరోల్లాగే మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలను వదిలేశాడు. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం, కథలు సూట్ కాకపోవడం తదితర కారణాలతో కొన్ని సినిమాలను పక్కన పెట్టేశారు. అదే సమయంలో మహేశ్ వద్దనుకుని వదిలేసిన కొన్ని సినిమాల కథలు ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్స్ హిట్స్ తెచ్చిపెట్టాయి. అలా సూపర్ స్టార్ రిజెక్ట్ చేసిన ఒక కథతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. ఆ సినిమా మరేదో కాదు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ రేసు గుర్రం. ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా హీరో పాత్రను డిజైన్ చేశారట సురేందర్ రెడ్డి. మహేశ్ కు కథ కూడా వినిపించడట. అతను కూడా సురేందర్ రెడ్డి కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే అప్పటికే బిజీ షెడ్యూల్ ఉండడంతో రేసు గుర్రం సినిమాకు కాస్త టైమ్ ఇవ్వాలని మహేష్ అడిగారట. అయితే సురేందర్ రెడ్డి మహేశ్ బాబు బిజీ షెడ్యూల్ ను గమనించి అదే కథను అల్లు అర్జున్ కు వినిపించాడట.

అప్పటికే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ స్టోరీలు చేసి మంచి మాస్ కథ కోసం వెయిట్ చేస్తున్న బన్నీకి రేసుగుర్రం కథ బాగా నచ్చింది. వెంటనే ఒకే చెప్పేశాడు. దీంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో బాగా పండాయి. ఆడియెన్స్ కు కూడా ఈ మూవీ తెగ నచ్చేసింది. రేసు గుర్రం సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పాత్రతో పాటు అతని సోదరుడిగా నటించిన తమిళ నటుడు శ్యామ్ రోల్ కు కూడా మంచి స్పందన వచ్చింది. మద్దాలి శివారెడ్డి పాత్రలో రవి కిషన్ కూడా తెలుగులో బాగా ఫేమస్ అయిపోయాడు. అలాగే శ్రుతి హాసన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది. ఇక తమన్ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒకవేళ రేసు గుర్రం సినిమా మహేశ్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు.. కానీ లక్కీ పాత్ర అల్లు అర్జున్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *