భర్త బండిలో నుంచి ఎరువులను దించుతుండగా.. భార్య పొలంలోకి వెళ్లింది. ఇంతలో పొలంలో నక్కి ఉన్న పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. పొలం పక్కన ఉన్న సరస్సు ఒడ్డుకు ఆమెను లాక్కెళ్లింది. మహిళ అరుపులు విని ఆమె భర్త, ఇతర కూలీలు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జనం అలికిడి విని పులి పారిపోయింది. అయితే, పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహాయంతో మృతురాలి కుటుంబానికి తక్షణ సాయం అందించారు అటవీశాఖ అధికారులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం చిమూర్‌లోని ఉప-జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల డిమాండ్‌తో అటవీ సిబ్బంది పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. 12 మంది బృందంతో తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని ముల్-మరోడా అటవీ ప్రాంతంలో మ్యాన్ ఈటర్ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పశువైద్య అధికారులు, రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయంతో ఎట్టకేలకు సోమనాథ్ ప్రాజెక్ట్ సమీపంలో పులిని బంధించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పులిని చంద్రపూర్‌లోని సేఫ్ జోన్‌కు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం
ఫోన్ వద్దు.. పోదాం గ్రౌండ్‌కి అంటున్న కలెక్టర్! ఎక్కడంటే
మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి
‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రీమియర్ షో.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్