Mahalaya Amavasya: రేపే మహాలయ అమావాస్య వీటిని దానం చేయండి.. పేదరికం, అనారోగ్యం తొలగిపోతుంది..

Mahalaya Amavasya: రేపే మహాలయ అమావాస్య వీటిని దానం చేయండి.. పేదరికం, అనారోగ్యం తొలగిపోతుంది..


భాద్రప్రద మాసం అమావాస్య మహాలయ అమావాస్యని హిందువులు విశేషమైన రోజుగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రపరంగా కూడా ఈరోజుకి విశేషమైన ప్రముఖ్యత ఉంది. అటువంటి అమావాస్య ఈ ఏడాది ఆదివారం రోజు వచ్చింది. సూర్యుడి అనుగ్రహంతో పాటు పితృ దోషాలు తొలిగేందుకు ఆదివారం అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం ఫలవంతం.

ఆదివారం అమావాస్య నాడు ఉదయాన్నే నిద్రలేచి.. వీలయితే నదీ స్నానం చేయాలి. వీలు కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగా జలం వేసుకుని స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసి.. సూర్య అనుగ్రహం కోసం మంత్రాలు జపించాలి.. ధూప దీపంతో పూజాదికార్యక్రమాలను నిర్వహించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత శివుడిని లేదా సూర్యుడిని ప్రార్ధించండి. ఈ రోజున సూర్య దోషం ఉన్నవారు లేదా గ్రహ దోషాలు ఉన్నవారు పేదలకు ఆహారం, బట్టలు , డబ్బును దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

పూజా విధి..

  1. ఉదయం: ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి మనస్సు మరియు శరీరాన్ని శుద్ధిగా ఉంచుకుని శుభ్రమైన బట్టలు ధరించండి.
  2. పూజా స్థలాన్ని శుభ్రపరచండి: ఇంటిని శుభ్రం చేసుకోండి. పూజ కోసం పవిత్రమైన స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేయండి
  3. ఇవి కూడా చదవండి

  4. సమర్పణ: దీపం వెలిగించి, ధూపం వేసి , రాగి పాత్రలో నీరు, పూలు, అక్షతలు వేసి సూర్యుడి అర్ఘ్యం సమర్పించండి.
  5. పూర్వీకుల కోసం : మీ పూర్వీకులకు ఆహారాన్ని, తర్పణం అందించండి. నువ్వులు కలిపిన నీటిని సమర్పించి తర్పణం విడవండి
  6. శివుడు: అమావాస్య అంటే చంద్రుడు లేని రోజు కనుక శివుడిని ప్రార్థించడం ఒక శక్తివంతమైన రోజు. శివుడికి పాలు, తేనె, బిల్వ పత్రాలు సమర్పించండి.
  7. రావి చెట్టు : పూర్వీకులు, త్రిమూర్తులు నివసించే రావి చెట్టుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున రావి చెట్టుకు పాలు, చక్కెర కలిపిన నీటిని సమర్పించి పూజించండి.
  8. ఆదివారం అమావాస్య రోజున చేయాల్సిన దానాలు
  9. ఆహారం, బట్టలు: పేదవారికి, దేవాలయాలకు లేదా బ్రాహ్మణులకు ఆహారం, బట్టలు , డబ్బును దానం చేయండి.
  10. జంతువులు: చేపలకు ఆహారంగా అటుకులు వంటి వాటిని అందించండి. చీమలు, కాకులు, ఆవులకు ఆహారం అందించండి.
  11. నల్ల నువ్వులు: నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనీశ్వర ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం.

ఆదివారం అమావాస్య రోజున చేయదగినవి.. చేయకూడనివి

  1. ఆధ్యాత్మిక అంతర్దృష్టిని పొందడానికి కొంతకాలం మౌనం (మౌనం) పాటించండి.
  2. మంత్ర జపంలో చేయండి. ముఖ్యంగా “ఓం నమః శివాయ” మంత్రం లేదా పితృ గాయత్రీ మంత్రం జపించండి.
  3. సాత్విక (శుద్ధ శాఖాహారం) ఆహారాన్ని తినాలి. ఉల్లి, వెల్లుల్లి తినొద్దు
  4. ఎవరి గురించి చెడుగా చెప్పవద్దు. వాదించవద్దు
  5. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, వాహనాలు లేదా బట్టలు వంటి కొత్త వస్తువులను కొనవద్దు
  6. జుట్టు లేదా గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా చేయవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *