అధిక రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ తాజా అధ్యయనాల ప్రకారం గుండె జబ్బులు ఉన్నవారిలో తక్కువ రక్తపోటు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది . అవును.. ఈ అధ్యయనాన్ని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలతోపాటు అంతర్జాతీయ సంస్థల బృందం నిర్వహించింది. 100/80 mmHg కంటే తక్కువ రక్తపోటు ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి కారణమేమిటో, తక్కువ రక్తపోటు ఎంత ప్రమాదకరమో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణ రక్తపోటు అంటే ఎలా ఉండాలి?
సాధారణంగా రక్తపోటు 120/80 mmHg పరిధిలోనే ఉండాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే దానిని తక్కువ రక్తపోటుగా పరిగణిస్తారు. ఈ స్థాయి రక్తపోటు గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మీ రక్తపోటు సాధారణంగా ఈ పరిధిలో ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగం డాక్టర్ అజిత్ జైన్ ప్రకారం.. తక్కువ రక్తపోటు కూడా గుండె సమస్యలను అధికంగా పెంచే ప్రధాన సమస్యల్లో ఒకటి. సాధారణంగా అధిక రక్తపోటును ప్రమాదకరమైనదిగా భావిస్తారు. కానీ రక్తపోటు సాధారణ పరిమితి కంటే ఎక్కువ లేదా తక్కువగా ఎలా ఉన్నా అది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.
తక్కువ రక్తపోటు ఎంత ప్రమాదకరం?
రక్తపోటు తగ్గడం ప్రారంభించినప్పుడు ఆక్సిజన్ మెదడుకు సరిగ్గా చేరదు. ఇది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఆక్సిజన్ గుండెకు చేరకపోతే అది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కారణం ఏదైనా ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా తగ్గితే గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఇది మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులోనే ఉండాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.