ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలు అయిన మారియా బ్రాన్యాస్.. రీసెంట్ గానే తన 117వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమె హెల్త్ సీక్రెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. అందులో ఏం తేలిందంటే..
హెల్దీ డీఎన్ఏ
బ్యాన్యాస్ అంత హెల్దీగా ఉండడానికి ఆమె శరీరంలో ఉన్న డీఎన్ ఏ కారణమని చెప్తున్నారు డాక్టర్లు. ఆమె జీవించిన లైఫ్ స్టైల్ కారణంగానో లేదా పుట్టుకతోనో.. ఆమె డీఎన్ ఎ ఎప్పుడూ హెల్దీగా ఉంటూ వస్తోంది. 117 ఏళ్ల వయసులో కూడా అమె యంగ్ డీఎన్ ఏను కలిగి ఉంది. దీంతో ఆమె ఇమ్యూనిటీ, హార్ట్ రేట్ ఇంకా హెల్దీగా ఉన్నాయి.
సెల్యూలార్ ఏజ్
బ్రాన్యాస్.. 2024 లోనే ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఉంది. అప్పుడే డాక్టర్లు ఆమె నుంచి స్వచ్ఛందంగా రక్తం, లాలాజలం, యూరిన్ వంటివి సేకరించి కొన్ని పరీక్షలు చేశారు. ఈ పరీక్షల ఆధారంగా ఆమె శరీరంలోని కణాల వయసు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తుంచారు. దీన్నే సెల్యూలార్ ఏజ్ అంటారు. వయసుతోపాటే సెల్యూలార్ ఏజ్ కూడా తగ్గిపోతుంటుంది. కానీ, బ్రాన్యాస్ శరీరంలోని కణాల వయసు ఇంకా యంగ్ గానే ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఇప్పటికీ బ్యాన్యాస్ మంచి ఆరోగ్యంతో ఉన్నారని, గుండె ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.
సీక్రెట్ ఇదే..
బ్రాన్యాస్ వయసు పైబడినప్పటికీ, ఆమె రోగనిరోధక వ్యవస్థ, గట్ బ్యాక్టీరియా చాలా హెల్దీగా ఉన్నాయి. అలాగే ఆమె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్, ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు, మంచి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణాల వల్ల ఆమె శరీరంలోని కణాలు ఇప్పటికీ ఆరోగ్యంగా పనిచేస్తున్నట్టు డాక్టర్లు అంటున్నారు. బ్రాన్యాస్ చిన్నప్పట్నుంచీ మానసికంగా, శారీరకంగా చాలా చురుకైన జీవితాన్ని గడిపేవారట. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొనే వారట.
డైట్ ఇలా..
బ్రన్యాస్ ఎక్కువగా మెడిటరేనియన్ డైట్ తీసుకునే వారు. అంటే పెరుగు, పండ్లు, ఆకుకూరలు, చేపలు, నట్స్, కూరగాయలు ఉండే ఆహారం. ఇందులో మాంసాహారం తక్కువగా, శాకాహారం ఎక్కువగా ఉంటుంది. ఈ డైట్ కూడా ఆమె లాంగ్ లైఫ్ కు ముఖ్యమైన కారణం అయ్యి ఉండొచ్చు అని డాక్టర్లు భావిస్తున్నారు.
మొత్తానికి బ్రాన్యాస్ ఒక అసాధారణమైన వ్యక్తి అని, వయసుకి ఆరోగ్యానికి సంబంధం లేదని ప్రూవ్ చేసిన వ్యక్తి అని డాక్టర్లు, సైంటిస్టులు భావిస్తున్నారు. స్పెయిన్లోని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈమె ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వృద్ధాప్యంలో కూడా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయుర్దాయం పెంచేందుకు ఎలాంటి విధానాలు పాటించాలి? అనే విషయాలపై రీసెర్చ్ చేసి ఆ వివరాలను ప్రచురించే పనిలో ఉన్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..