Loan Apps: యాప్స్‌ నుంచి లోన్స్ తీసుకునేముందు ఇవి తెలుసుకోండి!

Loan Apps: యాప్స్‌ నుంచి లోన్స్ తీసుకునేముందు ఇవి తెలుసుకోండి!


వీలైనంత త్వరగా లోన్ పొందాలనుకునేవాళ్లు ఇన్‌స్టంట్ లోన్స్‌ను ఆశ్రయిస్తుంటారు. పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు పలు యాప్స్ కూడా లోన్స్‌ను అందజేస్తున్నాయి. వీటి ద్వారా లోన్స్ పొందేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..

ఆర్బీఐ రిజిస్టర్

యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేవాళ్లు ముందు ఆ యాప్ ఏ సంస్థకు చెందినది? యాప్ నమ్మదగినదేనా? అన్న విషయాలు చెక్ చేసుకోవాలి. యాప్ డీటెయిల్స్‌లోకి వెళ్లి లేదా గూగుల్‌లో సెర్చ్ చేసి దాని పేరెంట్ కంపెనీ వివరాలు తెలుసుకోవచ్చు. అలా సంస్థ మంచిదా? కాదా?  ఆర్‌బీఐలో రిజిస్టర్‌ అయ్యిందా? లేదా? వంటి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే లోన్ ఇచ్చే యాప్స్‌ను కేవలం ప్లే స్టోర్ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

టర్మ్స్ అండ్ కండిషన్స్

లోన్ తీసుకునే తొందరలో చాలామంది టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగా చదవరు. దీనివల్ల తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ బ్యాంకులతో పోలిస్తే.. లోన్ యాప్స్‌కు ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ భిన్నంగా ఉండొచ్చు. రీపేమెంట్స్, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ క్లోజర్ ఛార్జీలు, లేట్ పేమెంట్ ఛార్జీలు.. ఇలా కొన్ని రూల్స్ బ్యాంకులకు భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి అవన్నీ పూర్తిగా చదివిన తర్వాతే లోన్‌కు అప్లై చేయాలి.

కస్టమర్ సర్వీస్

యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేముందు ఆయా సంస్థల కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. సంబంధిత వెబ్‌సైట్, కస్టమర్ సపోర్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి.  రీపేమెంట్ లేదా డాక్యుమెంటేషన్.. ఇలా లోన్‌కు సంబంధించి ఏదైనా సమస్య వస్తే సంస్థ స్పందిస్తుందో లేదో రివ్యూల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

యాప్ పర్మిషన్స్

లోన్ యాప్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ అడిగే పర్మిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యాప్‌లు మీ ఫోన్ గ్యాలరీ, కాంటాక్ట్స్, లోకేషన్ కు యాక్సెస్ అడుగుతాయి. అయితే వాటన్నింటికీ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటికి అనుమతి ఇవ్వడం ద్వారా మీ పర్సనల్ డేటా ప్రమాదంలో పడుతుంది.

బెదిరింపులు

కొన్ని లోన్ యాప్స్ వాళ్లు..  సమయానికి లోన్ చెల్లింకపోతే పదేపదే కాల్స్ చేయడం, బెదిరింపు మెసేజ్‌లు పెట్టడం లేదా మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడటం వంటివి చేస్తుంటారు. ఇలాంటప్పుడు మీరు ఆ లోన్స్ యాప్స్ గురించి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *