మేషం: రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు కలవడం, వీటిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అపార ధన వర్షం కురిపిస్తాయి. ఈ మూడు రోజుల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరుగుతుంది.
మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న ధన కారకుడు గురువు పంచమంలో ఉన్న కుజ, చంద్రులను వీక్షించడం వల్ల చంద్ర మంగళ యోగానికి మరింత బలం కలిగింది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రాశివారు తమ నైపుణ్యాలన్నిటినీ పణంగా పెట్టి ఆదాయం పెంచు కోవడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, మదుపులు, పెట్టుబడులన్నీ ధన వర్షం కురిపిస్తాయి. వీటి మీద ఎంత దృష్టి పెడితే అంత మంచిది. భూలాభం కూడా కలుగుతుంది.
కన్య: ఈ రాశికి ధన స్థానంలో ఏర్పడిన చంద్ర మంగళ యోగాన్ని దశమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఉద్యోగపరంగా పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. మరింత హోదా, భారీ జీతభత్యాలతో ఉద్యోగులకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.
తుల: ఈ రాశిలో ఏర్పడిన చంద్ర మంగళ యోగాన్ని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ యోగానికి బలం మరింత పెరిగింది. ఈ రాశివారు ఈ మూడు రోజుల కాలంలో ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. ఆస్తి లాభం కలుగుతుంది.
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో ఏర్పడిన చంద్ర మంగళ యోగాన్ని రాశినాథుడైన గురువు సప్తమ స్థానం నుంచి వీక్షించడం వల్ల వీరికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడతాయి.
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఏర్పడిన చంద్ర మంగళ యోగాన్ని ధన కారకుడు గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి ప్రయత్నపూర్వక ధన లాభంతో పాటు అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి పెరగడంతో పాటు, మదుపులు, పెట్టుబడుల వల్ల కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయ మార్గాలు బాగా విస్తరించే అవకాశం ఉంది.