బేకింగ్ సోడా నిమ్మరసం: గ్యాస్ బర్నర్ శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడా,నిమ్మరసం ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక పెద్ద పాత్ర తీసుకొని దానిని గోరువెచ్చని నీటితో నింపండి. తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి, ఒక నిమ్మకాయ రసాన్ని పిండండి. బర్నర్‌ను ఈ ద్రావణంలో 30 నిమిషాల నుండి గంట వరకు నానబెట్టండి. తర్వాత పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్ ఉపయోగించి బర్నర్‌ను శుభ్రం చేయండి.
వెనిగర్: బర్నర్లపై అంటుకున్న గ్రీజు, మరకలను తొలగించడంలో వెనిగర్ కూడా చాలా సహాయపడుతుంది. దీని కోసం, స్ప్రే బాటిల్లో తెల్ల వెనిగర్, నీటిని సమాన భాగాలుగా కలపండి. ఈ ద్రావణాన్ని బర్నర్లపై స్ప్రే చేయండి. కనీసం 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. ఇలా చేయడం ద్వారా బర్నర్‌పై ఉన్న డస్ట్ మొత్తం పొయి క్లీన్‌గా మారుతుంది. అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
డిష్ వాషింగ్ సబ్బు, గోరువెచ్చని నీరు: దీని కోసం, ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని నింపి, దానికి కొంచెం డిష్ వాషింగ్ సబ్బు కలపండి. తరువాత, బర్నర్‌ను ఈ ద్రావణంలో నానబెట్టి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు, స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. ఇది బర్నర్‌ను కొత్తగా మెరిసేలా చేస్తుంది.
వెనిగర్, బేకింగ్ సోడా : ఈ ద్రావణం భారీ మురికి, మరకలను తొలగించడానికి చాలా బాగుంది. దీని కోసం, ఒక కంటైనర్‌లో సమాన భాగాలుగా నీరు, వెనిగర్ కలపండి. తర్వాత బర్నర్‌ను రాత్రంతా లేదా కనీసం 2-3 గంటలు ఆ నీటిలో నానబెట్టండి. తర్వాత దానిపై కొంచెం బేకింగ్ సోడా చల్లి పాత టూత్ బ్రష్‌తో స్క్రబ్ చేయండి. ఇది మరకలను సులభంగా తొలగిస్తుంది.
నిమ్మకాయ, ఉప్పు : బర్నర్ మీద గ్రీజు మరకలు ఉంటే, ఒక నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొంచెం ఉప్పు చల్లుకోండి. బర్నర్ మీద రుద్దండి. ఇలా చేయడం వల్ల మరకలు తొలగిపోయి బర్నర్ కొత్తగా మెరుస్తుంది. అంతేకాదు బర్నర్ రంద్రాల మధ్యలో చిక్కుకున్న డస్ట్ మొత్తం పోయి.. మంట కూడా సరిగ్గా మండుతుంది. దీని వల్ల గ్యాస్ కూడా ఎక్కవ ఆదా అవుతుంది. ప్రస్తుతం గ్యాస్ కొరత ఉన్నందున మీ ఇంట్లోని బర్నర్లు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే గ్యాస్ త్వరగా అయిపోవచ్చు. దీని వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.




