Kishan Reddy: వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులకు ముహూర్తం ఫిక్స్.. రామ్మోహన్ నాయుడితో కిషన్ రెడ్డి భేటీ..

Kishan Reddy: వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులకు ముహూర్తం ఫిక్స్.. రామ్మోహన్ నాయుడితో కిషన్ రెడ్డి భేటీ..


తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించి, పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించి మొత్తం 953 ఎకరాల భూసేకరణ పూర్తయింది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 2500 మీటర్ల రన్‌వే నిర్మించనున్నారు. ప్రస్తుతం డిజైన్, పని పరిధి ఖరారు అవుతోంది. అంతా సవ్యంగా జరిగితే జూలై 2026లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో ఒక సరికొత్త వ్యూహాన్ని మంత్రులు చర్చించారు. ఇక్కడి రన్‌వే ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంది. దీనిని పౌర విమానయాన అవసరాల కోసం కూడా ఉపయోగించుకునేలా రెండు మంత్రిత్వ శాఖలు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. విమానాశ్రయ భవనం, పార్కింగ్ కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.

పెదపల్లి జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీని కోసం ఇప్పటికే 980 ఎకరాల భూమిని గుర్తించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడానికి, ఏవైనా అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించడానికి ఇద్దరు మంత్రులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *