బిగ్బాస్ సీజన్ 9 మూడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. ఇప్పటికే మనీష్, శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కామనర్ దివ్య నికితా హౌస్ లోకి అడుగుపెట్టింది.
ఇక త్వరలోనే సీరియల్ బ్యూటీ కావ్య శ్రీ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు మరో నలుగురు సైతం ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అయితే ఇప్పటికే కావ్య శ్రీ పేరు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది.
బుల్లితెర ప్రేక్షకులకు కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు జనాలకు ఇష్టమైన హీరోయిన్ ఈ అమ్మడు. గోరింటాకు, చిన్ని సహా పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కావ్య.
అలాగే బిగ్ బాస్ సీజన్ 8 సమయంలోనూ ఈ అమ్మడు పేరు మారుమోగింది. సీజన్ 8 విన్నర్ నిఖిల్, కావ్య ఒకప్పుడు ప్రేమలో ఉన్నారు. కానీ కొన్నాళ్లకే వాళ్లిద్దరు విడిపోయారు. దీంతో సీజన్ 8 సమయంలో నిఖిల్ చేసిన కామెంట్స్..కారణంగా కావ్య పేరు తెగ వినిపించింది.
ఇక ఇప్పుడు సీజన్ 9లోకి ఈ అమ్మడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే మొదట్లో బిగ్ బాస్ లోకి రావడానికి ఒప్పుకొని కావ్య.. తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో ఇప్పుడు ఆమె ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.