కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతార: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించాడు. ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా విడుదల కానుంది. ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంతార 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.
హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.కాగా భారీ బడ్జెట్‌తో ‘కాంతార : చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. చాలా నెలల పాటు షూటింగ్ జరిగింది. అంతే కాదు కాంతారా టీమ్ ను వరుస ప్రమాదాలు వెంటాడటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార: చాప్టర్ 1’సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..
తాజాగా కాంతార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు. కాంతార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 28న జరగనుంది. ఈ ఈవెంట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. 28న సాయంత్రం హైదరాబాద్‌లో జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంతార2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.