Kantara : Chapter 1: ఏముంది సామి సాంగ్.. కాంతార : చాప్టర్ 1 నుంచి బ్రహ్మకలశ సాంగ్ విడుదల.. విన్నారా.. ?

Kantara : Chapter 1: ఏముంది సామి సాంగ్.. కాంతార : చాప్టర్ 1 నుంచి బ్రహ్మకలశ సాంగ్ విడుదల.. విన్నారా.. ?


కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. కొన్నాళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఈ మూవీ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న మూవీ కాంతార చాప్టర్ 1. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం పాట ఎంతటి ఆదరణ పొందిందో.. ఇప్పుడు ప్రీక్వెల్ లోనూ శక్తివంతదమైన పాటను మేకర్స్ చేర్చారు. అదే బ్రహ్మ కలశ. శివుడిని భక్తితో ఆరాధించే విధంగా ఈ పాటను రూపొందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

బ్రహ్మ కలశ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించక.. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. అబ్బి వి పాడారు. రిషబ్ శెట్టి మార్కింగ్ మేకింగ్, అజనీష్ లోక్ నాథ్ సంగీతంతోపాటు ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?



ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *