విడుదలకు ముందే ‘కాంతార చాప్టర్ 1′ సంచలనం సృష్టిస్తోంది. చిత్ర బృందం ప్లాన్ ప్రకారం ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 22) రిలీజైన ట్రైలర్ కు ఊహించని స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.’కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ రిలీజ్ తరువాత, బెంగళూరులో విలేకరుల సమావేశం జరిగింది. హీరో, దర్శకుడు రిషభ్ శెట్టితో సహా చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో రిషభ్ శెట్టి ఆసక్తికర సమాధానాలిచ్చారు. అయితే ఇదే సందర్భంగా రిషబ్ కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. కాంతార చాప్టర్ 1 కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అందులో లేవనెత్తిన అంశాలు తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. ‘కాంతార సినిమా చూడటానికి వచ్చే వారు మద్యం తాగకూడదు, పొగ తాగకూడదు, మాంసాహారం తినకూడదు’ అని పోస్టర్లో రాసి ఉంది. తాజాగా ప్రెస్ మీట్ లో రిషబ్ శెట్టి ఈ విషయంపై స్పందించాడు. నెట్టింట వైరలవుతోన్న పోస్టర్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు. ‘మనుషుల ఆహార పద్దతులు, అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కాంతార సినిమా గురించి ఎవరో నకిలీ పోస్టర్‌ను క్రియేట్ చేశారు. అది మా దృష్టికి కూడా వచ్చింది. అయితే వారు వెంటనే ఆ పోస్టర్‌ను తొలగించి క్షమాపణలు చెప్పారు’ అని రిషబ్ శెట్టి పేర్కొన్నాడు.
“ఆ పోస్టర్ కి మా ప్రొడక్షన్ హౌస్ కి ఎలాంటి సంబంధం లేదు. మేము దానిని చూసి షాక్ అయ్యాము. ఎవరో దానిని నాకు పంపారు. నేను వెంటనే దానిని ప్రొడక్షన్ గ్రూప్ లో పెట్టాను. ఎవరు ఇలా చేస్తున్నారు? వారు ఎందుకు చేస్తున్నారు? దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అని అడిగాను. ప్రతి ఒక్కరికీ వారి స్వంత జీవనశైలి ఉంటుంది. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఒక సినిమా ట్రెండ్‌గా మారి, కథనం సెట్ అయినప్పుడు, కొంతమంది తమ సొంత ఆలోచనలను అందులోకి తీసుకువస్తే, వారు నెట్టింట వైరలవుదామని భావించి ఇలా చేస్తారు. ఇది కూడా నిజమే. దీనికి నిర్మాణ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు’ అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
నెట్టింట వైరలవుతోన్న ఫేక్ పోస్టర్ ఇదే..
The post circulating on social media about #Kantara — “3 divine steps to watch Kantara” — is FAKE. It has no connection with the makers and originated from some fan IDs. pic.twitter.com/4aCsA0UTeU
— AB George (@AbGeorge_) September 22, 2025
కాంతార చాప్టర్ 1 ట్రైలర్ తెలుగు వీడియో :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.