కళ్యాణి ప్రియదర్శన్.. సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ హలో సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ కాగా.. నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పూర్తిగా మలయాళీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు లోక చాప్టర్ 1 : చంద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. ఇందులో చంద్ర పాత్రలో ఒదిగిపోయిన ఆమె తన నటనతో కట్టిపడేసింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా నటించి ఇండియన్ తొలి సూపర్ ఊమెన్ హీరోగా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి.. తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
కళ్యాణి మాట్లాడుతూ.. “అమ్మా నాన్న ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో చిన్నప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది. చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి రావాలని నాన్న గట్టిగా చెప్పడంతో న్యూయార్క్ లో ఆర్చిటెక్చర్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. 2017లో హలో సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాను. ఇప్పటివరకు సరదా పాత్రలే చేశాను. కానీ కొత్త లోక లో మొదటిసారి యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. ఫిట్నెస్ కోసం రోజూ గంటన్నరసేపు వర్కవుట్స్ చే్సతాను.. అరగంట గోల్ఫ్ ఆడతాను” అని అన్నారు. అలాగే ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్. ఇద్దరం కలిసి ఐదేళ్ల క్రితం వరణే అవశ్యముంద్ చిత్రంలో నటించాం. అప్పటినుంచి స్నేహితులయ్యాం. ఎలాంటి సలహా కావాలన్నా ముందుగా దుల్కర్ సల్మాన్ కే ఫోన్ చేస్తాను ఇని అన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ జీవితం విలువ తెలియాలన్నా ఉద్దేశ్యంతో తమ తల్లిదండ్రలు తనను, తన తమ్ముడిని చిన్నతనంలో వియత్నాంలోని ఓ అనాథాశ్రమంలో ఉంచారని.. అక్కడ అనాథ పిల్లలతో కలిసి ఉంటూ వాళ్లు తినే ఆహారమే తిన్నాము.. నేలపైనే పడుకున్నాం. ఆ అనుభవం జీవితం విలువ ఏంటో నేర్పించింది అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?