తెలుగు సినిమా ప్రపంచంలో హీరో వెంకటేశ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ప్రేమకథ సినిమాలతోపాటు కుటుంబకథలతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకీ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ కలిసుందాం రా. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వెంకీ సరసన సిమ్రాన్ నటించింది. కోలీవుడ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో వెంకీ, సిమ్రాన్ కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ వెంకీ కాదట. డైరెక్టర్ ఉదయ్ శంకర్ కలిసుందాం రా సినిమా కథను రెడీ చేసుకుని ముందుగా నాగార్జునను కలిశారట. కానీ అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశారు. చంద్రలేఖ, సీతారామరాజు వంటి చిత్రాల్లో నటించారు. ఆ వెంటనే ఫ్యామిలీ సినిమా అంటే జనాలు చూడరు అని భావించారట. దీంతో నాగార్జున ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారట.
ఇవి కూడా చదవండి

హీరోయిన్ రాధిక ఇంట్లో తీవ్ర విషాదం..

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.

మొదటి రోజే చేయకూడని సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

యూత్‌కు తెగ నచ్చేస్తోన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
ఆ తర్వాత అదే కథ వెంకీ వద్దకు చేరింది. ఉదయ్ శంకర్, వెంకీ కాంబో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2000 జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..