Jr.NTR : బెంగుళూరులో ఎన్టీఆర్.. రోడ్లపైకి భారీగా తరలొచ్చిన ఫ్యాన్స్.. సింహాద్రి సీన్ రిపీట్..

Jr.NTR : బెంగుళూరులో ఎన్టీఆర్.. రోడ్లపైకి భారీగా తరలొచ్చిన ఫ్యాన్స్.. సింహాద్రి సీన్ రిపీట్..


Jr.NTR : బెంగుళూరులో ఎన్టీఆర్.. రోడ్లపైకి భారీగా తరలొచ్చిన ఫ్యాన్స్.. సింహాద్రి సీన్ రిపీట్..

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. బాలనటుడిగా తెరంగేట్రం చేసి ఇప్పుడు హీరోగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తారక్ క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కర్ణాటకలో తారక్ ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. మార్చి 8న ఎన్టీఆర్ ఓ ప్రముఖ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బెంగుళూరు వెళ్లారు. తారక్ వస్తున్న విషయంలో తెలియడంతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున తారక్ ఫ్యాన్స్ చేరుకున్నారు. ఎన్టీఆర్ అన్నా.. ఎన్టీఆర్ అన్నా అంటూ ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెనుక పరిగెత్తుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్, బెంగుళూరు సెంటర్స్, ఆసుపత్రి ఇలా ఎక్కడ చూసినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కనిపించారు. అభిమానుల ఉత్సహాన్ని గమనించిన ఎన్టీఆర్ వాహనం నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభివాదం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

ఎన్టీఆర్ వాహనం నుంచి బయటకు రావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బెంగుళూరులో తారక్ క్రేజ్ గురించి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోస్ చూస్తుంటే సింహాద్రి సినిమాలోని సీన్ గుర్తోస్తుంది. సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ జనాలు పోటెత్తిన వాతావరణమే కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లడంతో అక్కడ మహాదేవపుర, ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్డు క్లియరెన్స్ చేసేందుకు శ్రమించారు.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఇదిలా ఉంటే.. ఇక్కడ మరో స్పెషల్ మూమెంట్ అంటే తారక్ న్యూలుక్. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ బయటకు రావడం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కోసమే స్పెషల్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే చాలా కాలంగా కెమెరాకు మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నయా లుక్ సైతం ఆకట్టుకుంటుంది.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *