Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..


Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ట్రిపుల్ ఆర్, దేవర హిట్స్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా డ్రాగన్. ( ప్రచారంలో ఉన్న పేరు). డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న తారక్.. తాజాగా ఆదివారం బెంగుళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకకు వెళ్లారు. ఎన్టీఆర్ రాక గురించి తెలియడంతో భారీగా ఫ్యాన్స్ తరలొచ్చారు. దీంతో దాదాపు 5 కి.మీ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం తారక్ మాట్లాడుతూ.. మహిళలను ఎలా గౌరవించాలో పదే పదే చెప్పడం తనకు నచ్చదని.. ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

తన ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరినీ మహిళలను గౌరవిస్తూ పెరిగేలా కచ్చితంగా చూసుకుంటానని అన్నారు. సినిమాల్లో కాకుండా బయటక కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇంత గొప్పగా మాట్లాడం పై ప్రశంసలు వస్తున్నాయి. అలాగే తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. తన కుటుంబంలో జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని అన్నారు. ఇంతలా తనకు ప్రేమ అందించిన ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నా కోసం వచ్చిన అభిమాన సోదరులందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన మీకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. మీ ప్రేమకు రుణపడి ఉంటాను. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *