Job vs Business: జాబ్ లేదా బిజినెస్.. మీకు ఏది సూట్ అవుతుంది? ఇలా తెలుసుకోండి!

Job vs Business: జాబ్ లేదా బిజినెస్.. మీకు ఏది సూట్ అవుతుంది? ఇలా తెలుసుకోండి!


కెరీర్ లో రాణించాలంటే జాబ్ లేదా బిజినెస్ ఏదో ఒకటి కచ్చితంగా ఎంచుకుని తీరాలి. అయితే ఉద్యోగం రావట్లేదని బిజినెస్ చేయడమో.. బిజినెస్ కు పెట్టుబడి లేదని ఉద్యోగంలో ఉండిపోవడమో చేయకూడదు. ముందు మీకు ఎలాంటి కెరీర్ సూట్ అవుతుందో ఆలోంచించి నిర్ణయం తీసుకోవాలి. అదెలాగంటే..

జాబ్ ఎవరికి..

జాబ్ లేదా బిజినెస్.. ఇందులో ఒకదానికి ఫిక్స్ అయ్యేముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం.  ముందుగా జాబ్ ఆప్షన్‌కు వస్తే.. జాబ్‌లో ముఖ్యంగా ఉండేది సేఫ్టీ ఉంటుంది. డబ్బు పరంగా ఒక సేఫ్టీ ఉంటుంది. లాభ నష్టాల వంటివి ఉండవు.  స్కిల్స్ పరంగా అప్‌డేట్ అవుతూ పొజిషన్ పరంగా పెంచుకుంటూ పోతే..  జాబ్ లో మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ దొరుకుతుంది. కంఫర్ట్, సేఫ్టీ కోరుకునేవాళ్లు, రిస్క్ తీసుకునే మైండ్ సెట్ లేని వాళ్లు కళ్లుమూసుకుని జాబ్‌కు వెళ్లిపోవడం మేలు.

బిజినెస్ ఎవరికి..

రిస్క్ ఉన్నా పర్లేదు కొత్తగా ఏదైనా చేయాలి అనుకునేవాళ్లు, కమ్యూనికేషన్, మార్కెటింగ్ విషయాలు తెలిసిన వాళ్లు  బిజినెస్ ట్రై చేయొచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఉండేది రిస్క్. బిజినెస్ వర్కవుట్ అవ్వకపోతే డబ్బుతో పాటు టైం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది.  ఒకసారి బిజినెస్‌లో నష్టపోతే కెరీర్‌‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కాబట్టి మీ మనస్తత్వాన్ని, స్కిల్స్‌ను బట్టి ఎలాంటి బిజినెస్ బెస్ట్ అనేది ఎంచుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ గా కాస్త సపోర్ట్ ఉన్నప్పుడే బిజినెస్ లోకి వెళ్లాలి. లోన్ లేదా అప్పు చేసి బిజినెస్ చేసే ఆలోచన ఉంటే.. మీ ఐడియాపై మీకు దృఢమైన నమ్మకం, పట్టుదల ఉండాలి.

ఏదీ తక్కువ కాదు

ఎక్స్ పర్ట్స్ ప్రకారం జాబ్ అయినా, బిజినెస్ అయినా.. దేనికుండే వెసులుబాట్లు, సవాళ్లు దానికుంటాయి.  ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అన్న భావన ఉండకూడదు. ఉద్యోగం ఒకరకమైన మనస్తత్వానికి సూట్ అవుతుంది. అందులో కూడా కెరీర్‌‌కు బోలెడు స్కోప్ ఉంటుంది. ఉద్యోగంలో రాణిస్తూ కూడా  ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. వారి స్కిల్స్‌పై ఫోకస్ పెట్టేవారికి ఉద్యోగం మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర కొత్త ఐడియాలు ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగల స్ట్రాటెజీలు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే అప్పుడు బిజినెస్ మంచి ఆప్షన్ అవుతుంది.

మిడిల్ వే..

ఇకపోతే ఈ రెండింటినీ ఒకేసారి చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇదే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం. ఉద్యోగం చేస్తూ అందులో కొంత శాతం పక్కన పెట్టి దాంతో ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టొచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. లేదా ఏదైనా సర్వీస్ అందించడం, రెంటల్ బిజినెస్.. ఇలా ఉద్యోగం చేస్తూ కూడా ప్యాసివ్ బిజినెస్ లు ప్లాన్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *