Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?


Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశారు హీరో రాజశేఖర్. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్టినరీ మ్యాన్ లో ఓ కీలక పాత్రలో కనిపించిన ఆయన ఇప్పుడు శర్వానంద్ బైకర్ లోనూ ఓ కీ రోల్ చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రాజశేఖర్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన వార్త తెగ వైరలవుతోంది. హీరో రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అందులో పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్).. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ఫోటోలు, వీడియోలే కనిపించాయి.
సినిమా అవకాశాలు లేక డాక్టర్ రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ పెట్టారని.. దీని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారని, ఈ ఫ్యాక్టరీ లో పనిచేసి ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వైరల్ వీడియోలు, వార్తలపై రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ స్పందించింది. ఇటీవల ఒక సినిమా ఈవెంట్ కు హాజరైన ఆమె రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలపై స్పందించింది. రాజశేఖర్ పేరుతో తమకు ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదని అదంతా ఫేక్ న్యూస్ మాత్రమే అంటూ కొట్టి పారేసింది.

‘అసలు ఆ గోటీల ఫ్యాక్టరీలు ఏంటో? ఎవరు? ఎందుకు ఇలా పోస్టులు షేర్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను, మా ఆయన, మా పిల్లలు అవి చూసి నవ్వుకుంటున్నాం. ఈ మధ్య సోషల్ మీడియా కూడా ఫేక్ గా మారిపోతోంది. అందులో ఏమైనా నెగెటివిటీ విమర్శలు వచ్చాయి అంటే దాన్ని చూసి బాధపడాలా లేదా అనే ఆలోచన ఎవరికీ లేదు. ఏది నిజమో? ఏది అబద్దమో కూడా తెలుసుకోలేకపోతున్నాం. రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ వస్తున్న ఫేక్ ప్రచారం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇందులో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని విన్నాను. అలాంటివి జరుగుతుండడం చాలా బాధాకరం. దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి పోస్టులను ఎవరు కూడా నమ్మకండి . మీకు పూర్తిగా దానిపై అవగాహన వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆరా తీయండి. ఎందుకంటే ఈ మధ్య న ప్రతీది ఫేక్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అది ఫేక్ అని మేము వెళ్లి చెప్పలేం కదా. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని జీవిత చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంతా కల్పితమే నని ఫుల్ క్లారిటీ ఇచ్చింది జీవిత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *