Headlines

Janhvi Kapoor : కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్.. పుట్టినరోజున శ్రీవారి దర్శనం..

Janhvi Kapoor : కాలి నడకన తిరుమలకు జాన్వీ కపూర్.. పుట్టినరోజున శ్రీవారి దర్శనం..


ప్రముఖ దివంగత నటి శ్రీదేవి కూతురు హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చిన జాన్వీ రిలయన్స్ కు చెందిన రాధేయం గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈ రోజు పుట్టిన రోజు కావడంతో జాన్వీ విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. తన పిన్ని నటి మహేశ్వరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన జాన్వీ తిరుమల చేరు కోగా నడకదారి భక్తులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇప్పుడు రామ్ చరణ్ జోడిగా పెద్ది చిత్రంలో నటిస్తుంది.ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అలాగే దేవర 2 చిత్రంలోనూ కనిపించనుంది. మరోవైపు అటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *