IRCTC: ఒకే టికెట్‌తో దేశమంతా తిరగొచ్చు! ఐఆర్‌‌సీటీసీ ప్లాన్ అదుర్స్!

IRCTC: ఒకే టికెట్‌తో దేశమంతా తిరగొచ్చు! ఐఆర్‌‌సీటీసీ ప్లాన్ అదుర్స్!


తరచుగా వివిధ ప్రాంతాలు తిరిగే వాళ్ల కోసం ఐఆర్ సీటీసీలో ‘సర్కులర్ జర్నీ టికెట్’ అనే సర్వీసు ఉందని మీకు తెలుసా? ఈ టికెట్ ఒకసారి తీసుకుంటే రూట్ ను బట్టి 56 రోజుల పాటు ఎన్నిసార్లైనా ఎన్ని జర్నీలైనా చేయొచ్చు.

56 రోజుల పాటు..

ఇండియన్‌ రైల్వేస్ అందిస్తున్న ‘సర్క్యులర్‌ జర్నీ టికెట్‌’  ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. ఒకచోట ప్రయాణాన్ని మొదలుపెట్టి.. గరిష్టంగా 56 రోజుల పాటు ప్రయాణించి మళ్లీ తిరిగి స్టార్టింగ్ పాయింట్‌కు చేరుకునే వరకు ఈ సర్కులర్ టికెట్‌ వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం ప్రయాణంలో ఎనిమిది జర్నీ బ్రేక్‌లు తీసుకోవచ్చు. అంటే మధ్యలో ఎంపిక చేసుకున్న ఎనిమిది స్టేషన్లలో దిగి, కొద్దిరోజులు ఆ ప్రదేశాన్ని సందర్శించి మళ్లీ తిరిగి జర్నీ కంటిన్యూ చేయొచ్చు. ఇలా 56 రోజులపాటు ఒకే టికెట్‌తో ప్రయాణం చేసే వీలుంటుంది.

మల్టిపుల్ రూట్స్

ఈ టికెట్ మల్టిపుల్ రూట్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఉదాహరణకు హైదరాబాద్– మంత్రాలయం రోడ్ – తిరుపతి– బెంగళూరు– చెన్నై– భద్రాచలం రోడ్– హైదరాబాద్.. ఇది ఒక రూట్. ఇలా.. 30 కి పైగా రూట్స్ ఉన్నాయి. అది కేవలం సౌత్ సెంట్రల్ జోన్ లో మాత్రమే. ఇలా వేర్వేరు జోన్స్ లో మల్టిపుల్ రూట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఈ రూట్స్ వివరాలు చెక్ చేయొచ్చు.

వీరికి బెస్ట్

ఉద్యోగ, వ్యాపార పనుల మీద అనేక ప్రాంతాలు తిరిగేవాళ్లకు అలాగే ఒకేసారి ఎక్కువ విహార యాత్రలు, తీర్ధయాత్రలు చేయాలనుకునేవాళ్లకు ఈ టికెట్ బెస్ట్ ఆప్షన్.  రెగ్యులర్ ట్రైన్ టికెట్‌తో పోలిస్తే..  సర్క్యులర్‌ జర్నీ టికెట్ల ధరలు కూడా తక్కువే. అంతేకాదు, వీటిలో ప్రయాణానికి అనుకూలంగా నచ్చిన క్లాసును ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది.

బుకింగ్ ఇలా..

సర్క్యులర్‌  జర్నీ టికెట్ల కోసం దగ్గర్లోని రైల్వే డివిజనల్ మేనేజర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. జర్నీ ప్లాన్, జర్నీ బ్రేక్స్‌ను బట్టి వాళ్లు టికెట్ ధరను నిర్ణయిస్తారు. ప్రయాణాన్ని మొదలుపెట్టే స్టేషన్‌లో ఈ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో  సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఉంటుంది. అయితే విడివిడిగా బుక్ చేసుకుంటే అయ్యే  టికెట్ల ధర కంటే సర్క్యులర్‌ జర్నీ టికెట్ చౌకగానే ఉంటుంది. పైగా పదేపదే టికెట్లు బుక్ చేసుకునే పని కూడా తప్పుతుంది.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *