IPL 2026 Schedule : నేడే ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. సాయంత్రం 7 గంటలకు లైవ్ అప్‌డేట్

IPL 2026 Schedule : నేడే ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. సాయంత్రం 7 గంటలకు లైవ్ అప్‌డేట్


IPL 2026 Schedule : నేడే ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. సాయంత్రం 7 గంటలకు లైవ్ అప్‌డేట్

IPL 2026 Schedule : టీ20 వరల్డ్ కప్ ముగియడంతో క్రికెట్ అభిమానుల చూపు ఇప్పుడు ఐపీఎల్ 2026 వైపు మళ్లింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్‌పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా గతంలో చెప్పినట్లుగానే, నేడు (మార్చి 11, బుధవారం) ఐపీఎల్ కొత్త సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేయబోతున్నారు. అయితే మొత్తం టోర్నీ షెడ్యూల్‌ను కాకుండా, కేవలం మొదటి 20 రోజులకు సంబంధించిన మొదటి దశ షెడ్యూల్‌ను మాత్రమే ఈరోజు ప్రకటించనున్నారు.

ఎక్కడ, ఎప్పుడు లైవ్‌లో చూడాలి?

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకటన నేటి సాయంత్రం 7 గంటలకు వెలువడనుంది. ఈ వేడుకను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇక మొబైల్ లేదా ఇంటర్నెట్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడొచ్చు. నిజానికి ఈ షెడ్యూల్‌ను మార్చి 8న వరల్డ్ కప్ ఫైనల్ రోజే విడుదల చేయాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది నేటికి వాయిదా పడింది.

మార్చి 28 నుంచే క్రికెట్ పండగ

తాజా నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. గతంలో మార్చి 26నే మొదలవుతుందని వార్తలు వచ్చినప్పటికీ, రెండు రోజులు అటు ఇటుగా మార్చి 28ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ మే 31న జరగనుంది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ క్రికెట్ జాతరలో మొత్తం 10 జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

తొలి మ్యాచ్ ఎవరి మధ్య?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, సీజన్ ఆరంభ మ్యాచ్ ఎప్పుడూ డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్‌లోనే జరుగుతుంది. ఆ లెక్కన గత ఏడాది టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన సొంత గడ్డపై మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో ఆర్‌సీబీకి ప్రత్యర్థిగా గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ తలపడే అవకాశం ఉందని సమాచారం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 19వ సీజన్‌కు తెరలేవనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *