IPL 2026: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇక ధోని ఆడే మ్యాచ్‌లు ఇవే..?

IPL 2026: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇక ధోని ఆడే మ్యాచ్‌లు ఇవే..?


CSK Dhoni Availability Report: మహేంద్ర సింగ్ ధోనీ IPL 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. ఈ ఏడాది జులైలో ధోనీ 45 ఏళ్ల వయసుకు చేరుకోనున్నాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఆయన ఆడతాడని నిర్ధారించినప్పటికీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. సీఎస్‌కేకు యాజమాన్యం మేరకు, “ధోనీ చెన్నైకి వస్తున్న విషయం ఖాయం. ఈ సీజన్‌కు ఆయన అందుబాటులో ఉంటాడని స్పష్టంగా తెలిపారు. అయితే అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదా అన్నది టోర్నమెంట్ సమయంలోనే నిర్ణయిస్తాం” అని వెల్లడించింది.

సంజూ శాంసన్ రావడంతో వికెట్‌కీపింగ్‌లో ఆప్షన్..

ఈ సీజన్‌లో సీఎస్‌కే స్క్వాడ్‌లో సంజూ శాంసన్ చేరడంతో వికెట్‌కీపింగ్‌కు బలమైన ప్రత్యామ్నాయం లభించింది. ధోనీకి విశ్రాంతి ఇచ్చే మ్యాచ్‌లలో సంజూ గ్లౌజులు ధరించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ధోనీ మోకాలి, వెన్ను సమస్యలతో బాధపడుతున్నాడు. 45 ఏళ్ల వయసులో ప్రతి మ్యాచ్‌లో వికెట్‌కీపింగ్ చేయడం శరీరంపై అదనపు భారం కావొచ్చు. సంజూ కాకుండా ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ కూడా వికెట్‌కీపర్లుగా స్క్వాడ్‌లో ఉన్నారు. కార్తిక్ శర్మను సీఎస్‌కే భారీ ధరకు కొనుగోలు చేసి ఫినిషర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో ఉంది.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో లాభం..

గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా ధోనీని ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వినియోగించే అవకాశం ఉంది. చివరి ఓవర్లలో ఫినిషర్ పాత్ర పోషిస్తూ జట్టుకు కీలకంగా మారుతారు. ఫిట్‌నెస్ దృష్ట్యా తన బ్యాటింగ్‌ను కొన్ని ఓవర్లకే పరిమితం చేయాలనే యోచనలో ధోనీ ఉన్నాడు. మైదానంలో ఉన్నంత కాలం జట్టుకు మార్గనిర్దేశం చేసే మెంటార్‌గా కూడా ఆయన పాత్ర ఎంతో కీలకం.

చెపాక్ హోమ్ మ్యాచ్‌ల్లో తప్పక కనిపించే అవకాశం..

చెన్నై చెపాక్ స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. హోమ్ మ్యాచ్‌లన్నింటిలోనూ ఆడేందుకు ఆయన ప్రయత్నిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీ మైదానంలోకి అడుగుపెట్టగానే చెపాక్ అంతా ‘ధోనీ.. ధోనీ’ నినాదాలతో మార్మోగుతుంటుంది.

గత సీజన్‌లో రిటైర్మెంట్ చర్చలు..

గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ తల్లిదండ్రులు స్టేడియంలో మ్యాచ్ చూడటానికి రావడంతో రిటైర్మెంట్ చర్చలు జోరుగా నడిచాయి. మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి, 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ భారత్‌కు అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్‌లో ధోనీ రికార్డులు..

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ధోనీ (278 మ్యాచ్‌లు). సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. 38.30 సగటుతో 5439 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో 47 స్టంపింగ్స్, 158 క్యాచ్‌లు అతడి ఖాతాలో ఉన్నాయి.

ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు గెలిపించిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. మొత్తం 226 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023లో సీఎస్‌కేను చివరిసారి ఛాంపియన్‌గా నిలిపిన ఫైనల్‌లో కూడా ఆయనే కెప్టెన్‌గా ఉన్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *