డిస్ప్లే: ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంది. ఇందులో ప్రొమోషన్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1Hz నుండి 120Hz వరకు మార్చుకోవచ్చు. దీని బ్రైట్నెస్ కూడా చాలా మెరుగ్గా ఉంది. ఐఫోన్ 17లో గరిష్ట బ్రైట్నెస్ 3000 నిట్స్ వరకు ఉంటుంది. ఇది ఐఫోన్ 16లో ఉన్న 2000 నిట్స్ కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా స్క్రీన్ చుట్టూ ఉన్న బెజెల్స్ సన్నగా ఉన్నాయి. స్క్రీన్కు సిరామిక్ షీల్డ్ 2 రక్షణ ఉంది. డిస్ప్లే విషయంలో ఐఫోన్ 17 మెరుగ్గా ఉంది.
కెమెరా: కెమెరా విషయంలో ఐఫోన్ 17 గణనీయమైన మార్పులు సాధించింది. ఐఫోన్ 17లో బ్యాక్ కెమెరాలోని అల్ట్రావైడ్ లెన్స్ ఇప్పుడు 48MPగా ఉంది. ఇది ఐఫోన్ 16లోని 12MP అల్ట్రావైడ్ లెన్స్ కంటే మెరుగ్గా ఉంది. దీనివల్ల ఫోటోలు మరింత స్పష్టంగా వస్తాయి. సెల్ఫీ కెమెరా కూడా మెరుగైంది. ఐఫోన్ 17లో 18MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. ఇది గ్రూప్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఐఫోన్ 16లో 12MP సెల్ఫీ కెమెరా ఉంది.
పనితీరు – స్టోరేజ్: ఐఫోన్ 17లో కొత్త A19 బయోనిక్ చిప్ ఉంది. ఇది ఐఫోన్ 16లో ఉన్న A18 చిప్ కంటే వేగంగా, తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఐఫోన్ 17 బేస్ మోడల్ స్టోరేజ్ 256GB తో మొదలవుతుంది. ఐఫోన్ 16 బేస్ మోడల్ 128GBతో వస్తుంది. భారీ యాప్‌లు, మీడియా ఫైల్స్, AI ఫీచర్లు ఎక్కువగా వాడే వారికి ఈ మార్పు చాలా ఉపయోగపడుతుంది. రెండు ఫోన్లలో iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. కానీ కొత్త ఫీచర్లు మొదట ఐఫోన్ 17కి అందుతాయి.
బ్యాటరీ – కనెక్టివిటీ: ఐఫోన్ 17 బ్యాటరీ లైఫ్ ఐఫోన్ 16 కంటే దాదాపు 8 గంటలు ఎక్కువ. ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది. 40W ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 0 నుండి 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఐఫోన్ 16కి అదే ఛార్జింగ్‌కు దాదాపు 30 నిమిషాలు పడుతుంది. కనెక్టివిటీ పరంగా ఐఫోన్ 17లో బ్లూటూత్ 6, మెరుగైన వైఫై చిప్ ఉన్నాయి.
ఏ ఐఫోన్ కొనాలి?: ఐఫోన్ 17 అనేది మెరుగైన కెమెరా, వేగవంతమైన పనితీరు, మెరుగైన డిస్ప్లే, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునేవారికి మంచి ఎంపిక. ఈ కొన్ని మార్పులు మీకు అవసరం లేదు అనుకుంటే ఐఫోన్ 16 కూడా ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. ధరలో ఉన్న తేడాను, మీ అవసరాలను బట్టి ఏ ఫోన్ కొనాలో మీరు నిర్ణయించుకోవచ్చు.