ఎక్కడలేని క్రియేటివిటీ అంతా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనే కనిపిస్తుంది. మరి ఈ కాంపిటీషన్ ను తట్టుకుని ఇన్ స్టాలో మంచి రీచ్ సాధించాలంటే మీ కంటెంట్ క్రియేటివ్ గా ఉండాలి. ముఖ్యంగా రీల్స్ ను చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకోవాలి. కొత్తగా రీల్స్ చేసేవాళ్లు ట్రై చేయదగ్గ కొన్ని ఇంట్రెస్టింట్ రీల్ ఐడియాస్ మీ కోసం..
డైలీ లైఫ్
కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే టైం మీకు లేకపోతే.. మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో ఇంట్రెస్టింగ్ గా అనిపించే వాటినే రీల్స్‌గా మార్చి అప్‌లోడ్ చేయొచ్చు. ఇలాంటి రీల్స్‌కు మినిమం రీచ్ ఉంటుంది. అయితే అందులో కొంత ఫన్ ఉండాలి. ఒక ప్రాబ్లెమ్ దానికి ఫన్నీ సొల్యూషన్ ఉండేలా చూసుకోవాలి.
హౌ టు వీడియోస్
‘హౌ టు’ వీడియోస్‌కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది. చాలామందికి తెలియని కొత్త విషయాలను ఎలా చేయాలో వివరిస్తూ ఈ వీడియోలు చేయాలి. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఎక్కువ రీచ్. ఇందులో మీరు ప్రొడక్ట్స్ నుంచి డైలీ రొటీన్ వరకూ చాలా టాపిక్స్ ను ఎక్స్ ప్లోర్ చేయొచ్చు.
ట్రావెల్ వీడియోలు
ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రావెల్ రీల్స్‌కు మంచి రీచ్ ఉంటుంది. ఎవరు ఎక్స్ ప్లోర్ చేయని కొత్త ప్రదేశాలను మీరు విజిట్ చేసి దాన్ని అందంగా ప్రజెంట్ చేయాలి. పెద్ద పెద్ద టూర్లు వెళ్లలేకపోతే.. మీ రోజువారీ జర్నీలను కూడా క్రియేటివ్‌గా ఎడిట్ చేసి రీల్స్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. అయితే వీటిలో ఎడిటింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ప్రస్తుతం క్రియేటర్లు ఎలాంటి ఎడిటింగ్ స్టైల్స్ ను ఫాలో అవుతున్నారో గమనించి మీరు కూడా అలాంటి స్టైల్ ను రీక్రియేట్ చేయాలి.
ఆస్క్ మీ
మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్లతో ఎంగేజ్ అయ్యేందుకు ‘ఆస్క్ మీ ఎనీ థింగ్’ రీల్స్ పనికొస్తాయి. మిమ్మల్ని ఏదైనా అడగమంటూ ఒక పోస్ట్ పెట్టి.. కామెంట్స్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ రీల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. చాలామంది ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాటికి మీరిచ్చే ఆన్సర్ కూడా అంతే ఫన్నీగా క్రియేటివ్ గాఉండాలి.
రీక్రియేట్
పాపులర్ మీమ్స్, క్రికెట్ లేదా మూవీ లోని సీన్స్.. ఇలా ట్రెండ్ అవుతున్న వాటికి మీ కామెంట్రీ యాడ్ చేసి కొత్తగా రీల్ చేయొచ్చు. లేదా ట్రెండ్ అవుతున్న రీల్ టెంప్లేట్ ను మీస్టైల్ లో రీక్రియేట్ చేయొచ్చు. ఇవి తక్కువ టైంలోనే ఎక్కువ రీచ్ సాధిస్తాయి. త్వరగా ఫాలోవర్స్ ను పెంచుకోవాలంటే.. టెంప్లేట్స్ రీక్రియేషన్ బెస్ట్ ఆప్షన్.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..