Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరింత చౌకగా మంచి నీళ్ల బాటిల్‌!

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరింత చౌకగా మంచి నీళ్ల బాటిల్‌!


రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రైళ్లలో, రైల్వే స్టేషన్స్‌లో విక్రయించే రైల్‌ నీర్‌ వాటర్‌ బాటిల్స్‌ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలె జీఎస్టీ కౌన్సిల్‌ పలు వస్తు సేవలపై జీఎస్టీ తగ్గించడంతో రైల్‌ నీర్‌ బ్రాండ్‌ వాటర్‌ బాటిల్స్‌ తగ్గించింది. ఇప్పటి వరకు రైల్‌ నీర్‌ వాటర్‌ బాటిల్‌ లీటర్‌ రూ.15లకు విక్రయిస్తుండగా.. ఇక నుంచి రూ.14 లకే లభించనుంది. అలాగే 500 ఎంఎల్‌ బాటిల్‌పై కూడా రూ.1 తగ్గించింది. గతంలో రూ.10 ఉన్న హాఫ్‌ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర ఇప్పుడు కేవలం రూ.9లకే లభించనుంది.

తగ్గిన GST ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 సోమవారం నుండి అమలులోకి వస్తాయి. అలాగే రైల్వే ప్రాంగణాలు/రైళ్లలో విక్రయించే ఇతర బ్రాండ్‌ల IRCTC/రైల్వేలు షార్ట్‌లిస్ట్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల గరిష్ట రిటైల్ ధరను కూడా లీటరు బాటిల్‌కు రూ.15 నుండి రూ.14కు, 500 ml బాటిల్‌కు రూ.10 నుండి రూ.9 కు సవరించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *