
సక్సెస్ ఫెయిల్యూర్స్ ని కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే కాలం ఇట్టే గాయబ్ అవుతుంది. వాట్ నెక్స్ట్ అంటూ ముందుకు సాగితేనే ఏదైనా జరిగేది.. అని గట్టిగా ఫిక్సయ్యారు కెప్టెన్ శంకర్. అందుకే ఎవరో తనకు కండిషన్స్ పెట్టడం కాదు.. తాను కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఇన్నాళ్లూ కాంట్రవర్శీలకు దూరంగా ఉన్న శంకర్ ఫ్రేమ్ చేసిన రూల్స్ ఏంటి? ఇండియన్ త్రీక్వెల్‌కి దాంతో సంబంధం ఏంటి? కమాన్ లెట్స్ వాచ్… ఇండియన్ 3ని దాదాపుగా పక్కన పెట్టేసినట్టేనా? కాదా? ఇప్పుడిదో వెయ్యి డాలర్ల ప్రశ్న అన్నది ఇండస్ట్రీ మాట. అబ్బే.. అంతేం లేదండీ.. జస్ట్ 2, 3 మంత్స్ లోపే తేలిపోతుందన్నది శంకర్ కాంపౌండ్ నుంచి కాన్ఫిడెంట్ గా వినిపిస్తున్న సమాచారం. 2, 3 నెలల లెక్కేంటి? అని ఎవరన్నా అడిగితే పెద్ద స్టోరీనే చెబుతున్నారు శంకర్ నియర్ అండ్ డియర్స్. శంకర్ గేమ్ చేంజర్ పనుల్లో ఉన్నప్పుడు ఇండియన్ 2 ని కంప్లీట్ చేయమని ఆయన్ని లైకా కోరింది. దాంతో ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేయాల్సి వచ్చింది శంకర్. ఇండియన్2, గేమ్‌చేంజర్ రెండూ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇకపై సింగిల్ ప్రాజెక్ట్ అనే అజెండాతో ముందుకు సాగనున్నారట శంకర్. ఇండియన్ 3 ని లైకా కంప్లీట్ చేయాలనుకుంటే ఇంకో 2, 3 నెలల్లో పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తానని స్ట్రెయిట్‌గా చెప్పేశారట శంకర్. ఒకవేళ కాదూ, కూడదు అనుకుంటే మాత్రం వేల్పారి మూడు పార్టులూ పూర్తయ్యే వరకు ఇండియన్ 3 ప్రస్తావనే ఉండదని తేల్చేశారట. ఇప్పుడు ఏ విషయాన్నీ త్వరగా చెప్పాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉంది లైకా ప్రొడక్షన్స్. ఏదేమైనా ఇంకో రెండు మూడు నెలల్లో శంకర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే విషయం మీద ఫుల్ క్లారిటీ రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 2: తెలుగు ధురంధర్2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్
వెంకీ – కల్యాణ్‌రామ్ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా
Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్
Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..