India vs Pakistan Final Live Score, Asia Cup 2025, Todays Match Updates in Telugu: సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఆసియా కప్ 2025 ప్రయాణం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో ఇరుజట్లు ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. అందుకే, ఇలాంటి ఫైనల్ మొదటిసారి జరుగుతోందని చెబుతున్నారు.
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మూడో పోరు..
2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇది మూడవ మ్యాచ్ అవుతుంది. భారత్‌తో జరిగిన మునుపటి రెండు మ్యాచ్‌లు గ్రూప్ దశలో, సూపర్ ఫోర్ దశలో ఉన్నాయి. రెండింటిలోనూ పాక్ జట్టు ఓడిపోయింది. అయితే, మూడవ మ్యాచ్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఫైనల్ కాబట్టి ఒత్తిడి భిన్నంగా ఉంటుంది. భారత జట్టు తన అజేయ పరంపరను కొనసాగి ఈ టోర్నమెంట్‌ను గెలుస్తుందా? లేదా టోర్నమెంట్ ఫైనల్స్‌లో భారత్‌పై మెరుగైన రికార్డు ఉన్న పాకిస్తాన్ పురోగతి సాధిస్తుందా? అనేది చూడాలి.
ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను ఎనిమిదిసార్లు గెలుచుకుంది. మరోవైపు, పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే టైటిల్‌ను గెలుచుకుంది.