Asia cup 2025 India vs Pakistan Match Playing XI: ఆసియా కప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత్, నేడు సూపర్ 4 రౌండ్లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. గ్రూప్ దశలో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఏకపక్షంగా ఓడించిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్..
లీగ్ దశలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో కరచాలనం వివాదం చోటు చేసుకుంది. పహల్గామ్ దాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత, పాకిస్తాన్ టీం మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదుతో ఐసీసీని సంప్రదించింది.
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. అలా జరగకపోతే, కనీసం అతడిని పాకిస్తాన్ మ్యాచ్‌ల నుంచి అయినా మినహాయించాలి. పీసీబీ డిమాండ్లలో దేనినీ ఐసీసీ అంగీకరించలేదు. నేటి మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ ఇప్పటికీ రిఫరీగా ఉండనున్నారు. నిరసనగా పాకిస్తాన్ నిన్న తన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కూడా రద్దు చేసుకుంది.
భారత్, పాక్ జట్ల ప్లేయింగ్ 11:
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..