ఆసియా కప్ 2025లో భారత జట్టు తిరుగులేని జట్టుగా ఉంది. ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచి ఫైనల్ చేరింది. గ్రూప్ దశలో, సూపర్ ఫోర్ లో రెండుసార్లు తలపడినా పాకిస్తాన్ చేతిలో అస్సలు ఓడిపోలేదు. ఇక ఇప్పుడు ఆసియా కప్ 2025 ఫైనల్ జరగనుంది. ఇప్పుడు పాకిస్తాన్ కే ఎక్కువ ఆధిక్యం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి పాకిస్తాన్ ప్రయోజనం ఏంటి.? టీమిండియా పరిస్థితి ఏంటి ఇప్పుడు చూసేద్దాం.
ఫైనల్లో పాకిస్థాన్ ఆధిక్యం..
41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ ఫైనల్ లో తలపడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ.. ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఇది 13వ టోర్నమెంట్ ఫైనల్. గత 12 టోర్నమెంట్ ఫైనల్స్ ఫలితాలు పాకిస్తాన్ కు ఆధిక్యం ఉందని సూచిస్తున్నాయి. 2025 ఆసియా కప్ ఫైనల్కు ముందు జరిగిన 12 టోర్నమెంట్లలో.. పాకిస్తాన్ ఎనిమిది సార్లు ఫైనల్ చేరి గెలిచింది. భారత్ నాలుగు సార్లు మాత్రమే ఫైనల్ లో విజయం సాధించింది. అంటే టోర్నమెంట్ ఫైనల్స్లో పాకిస్తాన్.. భారత్ కంటే మూడింతల ఆధిక్యంలో ఉంది.
2025 ఆసియా కప్ గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా ఆటతీరులో ఎలాంటి మార్పు అవసరం లేదు. ప్రస్తుతం భారత జట్టు ఆడుతున్న తీరు.. పాకిస్తాన్ ను కచ్చితంగా భయపెడుతుంది. టీం ఇండియా ఖచ్చితంగా విజయానికి చేరువలో ఉందని చెప్పొచ్చు. పాకిస్తాన్తో జరిగిన గత పది T20I మ్యాచ్లలో భారత్ ఎనిమిదింటిని గెలుచుకుంది. అయితే, ప్రస్తుతానికి, టోర్నమెంట్ ఫైనల్స్ గణాంకాలు, చరిత్ర ఆధారంగా, టీం ఇండియా కొంచెం వెనుకబడే ఉంది. కానీ గెలిచేది మాత్రం భారత్ అనే చెప్పాలి.