మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ, “టోర్నమెంట్ ప్రారంభంలో సూర్యకుమార్ యాదవ్ నాతో వ్యక్తిగతంగా కరచాలనం చేశారు. టోర్నమెంట్‌కు ముందు జరిగిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, రిఫరీల సమావేశంలో కూడా కరచాలనం చేశారు. కానీ కెమెరాలు ఉన్నప్పుడు, వారు మాతో కరచాలనం చేయరు” అని పేర్కొన్నారు.