Asia Cup 2025, India vs Pakistan: ఆసియా కప్‌లోకి భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ట్రోఫీని గెలుచుకునే దిశగా టీమిండియా బలంగా ముందుకు సాగింది. కానీ, పాకిస్తాన్ పేలవ ఫాం కారణంగా తడబడుతూ ఫైనల్ చేరుకుంది.
ఈ ఆసియా కప్ ఎడిషన్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆరు పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధిస్తుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే, శ్రీలంకతో జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో బౌలింగ్ దాడి ఆందోళనకరంగా ఉంది. 202 పరుగులు చేసినప్పటికీ, మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌లో భారత్ గెలిచింది. కానీ, పాకిస్తాన్‌పై ఖరీదైన తప్పులు చేసింది.
భారతదేశం ఆ తప్పులను నివారించాల్సిందే..
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా చేసిన తప్పు కారణంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరుకుంది. ఒక క్యాచ్‌ను వదిలేయడంతో మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరుకుంది. చివరి ఓవర్ చివరి బంతికి శ్రీలంక గెలవడానికి మూడు పరుగులు అవసరమైనప్పుడు, అక్షర్ పటేల్ తప్పుగా ఫీల్డింగ్ చేశాడు. విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ అలాంటి అవకాశాలను వదులుకోదు. దసున్ షనక చివరి బంతికి రెండు పరుగులు తీసి మ్యాచ్‌ను టై చేశాడు. ఇదంతా అక్షర్ పటేల్ తప్పిదంతో జరిగింది.
ఇవి కూడా చదవండి
ఎవరు ఎన్ని క్యాచ్‌లు వదిలారు?
ఆసియా కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ సెప్టెంబర్ 24న జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత, టోర్నమెంట్‌లో మొత్తం 53 క్యాచ్‌లు జారవిడిచినట్లు గణాంకాలు విడుదలయ్యాయి. ఆశ్చర్యకరంగా, భారత జట్టు అత్యధిక క్యాచ్‌లను జారవిడిచింది. మొత్తంగా భారత జట్టు 12 క్యాచ్‌లను జార విడిచింది. హాంకాంగ్ 11 క్యాచ్‌లతో రెండవ స్థానంలో ఉంది. ఆసక్తికరంగా, పాకిస్తాన్ కేవలం 3 క్యాచ్‌లను మాత్రమే జారవిడిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..