Haris Rauf Wife Muzna Masood Malik: పాకిస్థాన్ క్రికెటర్ హరీస్ రౌఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్, ఇటీవలే ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత వివాదాస్పద పోస్ట్‌తో వార్తల్లోకి వచ్చారు. ఆమె భర్త హరీస్ రౌఫ్ మైదానంలో చేసిన ‘6-0’ సంజ్ఞను సమర్థిస్తూ, ‘మ్యాచ్ ఓడినా, పోరాటంలో గెలిచాం’ అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రా’సుకొచ్చింది. ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సంఘటనతో ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది.
ఈ 6-0 అంటే ఏమిటి ?
బౌండరీ లైన్ వద్ద హారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తుండగా, భారత అభిమానులు “కోహ్లీ, కోహ్లీ!” అని నినాదాలు చేస్తున్నారు. ఇది హారిస్ రవూఫ్‌ను చికాకు పెట్టింది. అతను “6-0” అనే సంజ్ఞ చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆరు భారత రాఫెల్ జెట్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ తప్పుగా చెబుతోంది. ఈ వాదనకు నిజం లేదు. అయితే, పాకిస్తాన్ క్రికెటర్లు ఇలా జరిగిందని నమ్ముతున్నారు. అందుకే హారిస్ రవూఫ్ అలాంటి సంజ్ఞలు చేస్తున్నట్లు కనిపించాడు. హారిస్ రవూఫ్ భార్య ముజ్నా తన కథలో పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయింది. కానీ, యుద్ధంలో గెలిచిందని కూడా రాసుకొచ్చింది.
ఎవరు ఈ ముజ్నా మసూద్ మాలిక్?
ముజ్నా మసూద్ మాలిక్ 1997, అక్టోబర్ 20న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జన్మించింది. ఆమె ఇస్లామాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ పూర్తి చేసింది. అంతేకాకుండా, ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌లో కూడా ఉన్నత డిగ్రీ సాధించింది. ముజ్నా ఒక ఫ్యాషన్ మోడల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె పాకిస్థాన్‌లోని పలు ప్రముఖ వస్త్ర బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. టిక్‌టాక్‌లో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి
ముజ్నా, హరీస్ రౌఫ్ ఒకే యూనివర్శిటీలో చదువుకున్నారు. అక్కడ వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ డిసెంబర్ 2022లో సాంప్రదాయ పద్ధతిలో నిఖా చేసుకున్నారు. ఆ తర్వాత జులై 2023లో గ్రాండ్ వెడ్డింగ్ సెరిమొనీ జరిగింది. ముజ్నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. హరీస్ రౌఫ్-ముజ్నా దంపతులకు మార్చి 2025లో ఒక మగబిడ్డ జన్మించాడు. అతడి పేరు ముహమ్మద్ ముస్తఫా హరీస్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..