ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం. గ్రూప్ దశలో తొలుత పాక్‌ను ఓడించిన టీమిండియా, తాజాగా సూపర్ ఫోర్ దశలో రెండోసారి ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అయితే మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. పాక్‌పై విజయం తర్వాత.. ‘యూ టాక్, వీ విన్’ అంటూ మ్యాచ్ గెలిచిన పిక్స్ పంచుకున్నాడు. అభిషేక్ శర్మ ఇలా ట్వీట్ చేయడానికి ఒక కారణం ఉంది. 172 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ అద్భుతమైన స్టార్ట్ అందించారు. తొలి వికెట్‌కు సెంచరీ ప్లస్ పార్నర్‌షిప్ అందించారు. ఇలా టీమిండియా ఓపెనర్లు చెలరేగుతుంటే పాకిస్థాన్ బౌలర్లు ఏం చేయలేక.. నోటికి పనిచెప్పారు. షాహీన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్ అకారణంగా భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నారు.
ఇది చూసి చూసి ఇక భరించలేకపోయిన అభిషేక్ శర్మ ఒకానొక దశలో హరీస్ రౌఫ్‌కు ఎదురుతిరగాడు. ఇలా పాక్ ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ బ్యాట్‌తో కూడా వారికి బుద్ధి చెప్పాడు. మ్యాచ్‌లో జరిగిన ఈ డ్రామా తర్వాత అభిషేక్ ఆ ట్వీట్ చేశాడు. పాక్ ఆటగాళ్లు మాట్లాడుతూనే ఉంటారు, మేం మ్యాచ్‌లు గెలుస్తూనే ఉంటాం అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. మ్యాచ్‌లో హరీస్ రౌఫ్‌కు వార్నింగ్ ఇవ్వడం, మ్యాచ్ తర్వాత చేసిన ట్వీట్ చూస్తే అభిషేక్ శర్మ ఆట మాత్రమే కాదు.. అతని మాట కూడా తూటానే అని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
You talk, we win 🇮🇳 pic.twitter.com/iMOe9vOuuW
— Abhishek Sharma (@OfficialAbhi04) September 21, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి