IND vs PAK: భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య హై-ఫై.. వివాదాల మధ్య షాకింగ్ సీన్..

IND vs PAK: భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య హై-ఫై.. వివాదాల మధ్య షాకింగ్ సీన్..


India, Pakistan Football Team Players High Five: ఆసియా కప్‌ 2025లో క్రికెట్ కంటే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కరచాలన వివాదం ఇప్పుడు ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. ఆదివారం జరిగిన సూపర్ 4 దశలో పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత్ తన బలాన్ని ప్రదర్శించింది. కానీ మ్యాచ్ తర్వాత, భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ఈ సంఘటనకు దారితీసింది. అయితే, దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ( SAFF) అండర్-17 ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య భిన్నమైన దృశ్యం బయటకు వచ్చింది.

భారత్, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య హై ఫైవ్..

దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ( SAFF) అండర్-17 ఛాంపియన్‌షిప్ సందర్భంగా భారత్, పాకిస్తాన్‌లకు చెందిన యువ ఫుట్‌బాల్ ఆటగాళ్ళు మైదానంలో స్నేహపూర్వక సంబంధాన్ని ప్రదర్శించారు. కొలంబోలోని రేస్‌కోర్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంలో రెండు జట్ల ఆటగాళ్లు హై ఫైవ్‌లతో కరచాలనం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో హాట్ టాపిక్‌గా మారిన కరచాలన వివాదానికి పూర్తి విరుద్ధంగా ఉంది.

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే రెండు దేశాల మధ్య మైదానంలో ఉద్రిక్తతల కథనాలు తరచుగా ముఖ్యాంశాలలోకి వస్తాయి. కానీ ఈసారి, మ్యాచ్ ప్రారంభానికి ముందు, ఆటగాళ్ళు కరచాలనాలు, హై- ఫైవ్‌ల ద్వారా పరస్పర గౌరవాన్ని వ్యక్తం చేసుకన్నారు. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో కరచాలన వివాదం త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. భారత్, పాకిస్తాన్ ఫైనల్‌లో ఒకరినొకరు ఎదుర్కొంటాయని అంతా భావిస్తున్నారు. అయితే, ఈ యూత్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అలాంటి ఉద్రిక్తత కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

భారత జట్టుదే విజయం..

ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 3-2 తేడాతో ఓడించి గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున డల్లామువో గాంగ్టే, గున్లీబా వాంగ్ఖేరక్‌పామ్, రెహాన్ అహ్మద్ గోల్స్ సాధించారు. అంతకుముందు, భారత్ మాల్దీవులను 6-0తో, భూటాన్‌ను 1-0తో ఓడించింది. పాకిస్తాన్ కూడా భూటాన్‌పై 4-0తో, ఆపై మాల్దీవులపై 5-2తో గెలిచింది. కానీ, భారత్ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *