ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం తొలి సూపర్ ఫోర్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్థాన్, గ్రూప్ బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ ఫోర్ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సూపర్ ఫోర్లో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఈ సూపర్ ఫోర్ పోటీలు భారత్, పాక్ పోరుతోనే మొదలు కానుంది.
ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఇప్పుడు సూపర్ ఫోర్‌లోనూ అదే రిపీట్ అవుతుందని క్రికెట్ అభిమానులంతా ధీమాగా ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ అంటేనే భయంతో వణికిపోతుంది. ఒక వైపు టీమిండియాకు కనీస పోటీ ఇవ్వలేక, మరోవైపు ఎలాగైనా గెలవాలనే ఒత్తిడిని జయించలేక పాక్ ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి టీమిండియాతో మ్యాచ్ అనగానే పాక్ జట్టు మొత్తం తీవ్ర ఒత్తిడిలో ఉంది.
అయితే ఈ ఒత్తిడిని జయించేలా, జట్టు మొత్తంలో ఉత్సాహం నింపేలా ఓ మోటివేషనల్ స్పీకర్‌ను కూడా పాకిస్థాన్ జట్టు హైర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మోటివేషనల్ స్పీకర్ తన స్పీచ్‌లతో పాక్ ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గించి, భారత్‌పై గెలిచేలా వారిలో మోటివేషన్ ఇవ్వనున్నాడు. ఈ చర్యతో టీమిండియాతో మ్యాచ్ అనగానే పాకిస్థాన్ టీమ్ మొత్తం ఎంత ఒత్తిడిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మోటివేషన్ స్పీకర్ అయినా పాకిస్థాన్ తలరాత మారుస్తాడో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి