IND Vs PAK: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలిచినా ట్రోఫీ తీసుకోదా.? తగ్గేదేలే అంటోన్న సూర్య.!

IND Vs PAK: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలిచినా ట్రోఫీ తీసుకోదా.? తగ్గేదేలే అంటోన్న సూర్య.!


గత సంవత్సర కాలంగా టీం ఇండియా రెండు ప్రధాన ట్రోఫీలను అందిపుచ్చుకుంది. జూన్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు T20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోగా.. ఆ తర్వాత మార్చి 2025లో రోహిత్ కెప్టెన్సీలోనే ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు అందరి దృష్టి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియాపై పడింది. పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య సేన ఉవ్విళ్ళూరుతోంది.

ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28 ఆదివారం నాడు దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య ఇది మూడో మ్యాచ్. కానీ టోర్నమెంట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి. కాబట్టి ఈ ఫైనల్ చాలా ప్రత్యేకమైనది. రెండు జట్లు ట్రోఫీని కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. అయినప్పటికీ, భారత్ ఫైనల్‌లో గెలిచినా, వారు ట్రోఫీని అందుకోకపోవచ్చు.

నఖ్వీ నుంచి టీం ఇండియా ట్రోఫీని తీసుకుంటుందా?

నిజానికి, టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్ గెలిచి మళ్లీ ట్రోఫీ అందుకుంటుంది. కానీ ట్రోఫీ కెప్టెన్‌కు అందించే సమయంలో సూర్య దానిని అంగీకరించకపోవచ్చు. దీనికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ.. ACC ఛైర్మన్‌గా ఉండటంతో పాటు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రభుత్వ అంతర్గత మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా టీం ఇండియా ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అధికారులతో ఎటువంటి హ్యాండ్ షేక్‌లు లాంటివి చేయలేదు.

ఇక మొదటి మ్యాచ్‌లో నో హ్యాండ్ షేక్ ఇప్పటికే పెద్ద వివాదంగా చెలరేగింది. ఆ తర్వాత మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ విన్నర్‌కు ట్రోఫీని అందజేస్తే టీమ్ ఇండియా దాన్ని బహిష్కరిస్తుందని నివేదికలు వినిపించాయి. నిబంధనల ప్రకారం, ACC అధ్యక్షుడు ఫైనల్ విన్నింగ్ కెప్టెన్‌కు ట్రోఫీని అందజేస్తాడు. అయితే, పాకిస్తాన్‌లో నఖ్వీ మూలాలు టీమ్ ఇండియా ప్రస్తుత వైఖరికి ఆటంకం కలిగిస్తున్నాయి. అతడు టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా చేసే వ్యాఖ్యలకు.. అటు ఫ్యాన్స్, ఇటు బీసీసీఐ మండిపడుతున్నారు.

భారత్‌పై నఖ్వీ తీవ్ర వ్యతిరేకత పోస్టులు..

ఆసియా కప్ వివాదం సమయంలో నఖ్వీ ప్రవర్తన కారణంగా భారత జట్టు కూడా అతన్ని బహిష్కరించవచ్చు. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం మధ్య నఖ్వీ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని తన సోషల్ మీడియా ఖాతాలలో భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లను పెట్టిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాదు, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, సూర్యకుమార్ యాదవ్‌ను హ్యాండ్ షేక్ చేయనందుకు, పహల్గామ్ ప్రాణనష్టానికి సంబంధించి మాట్లాడినందుకు.. అతడిపై నిషేధం విధించాలని నఖ్వీ స్వయంగా ఐసిసిని సంప్రదించాడు. అందువల్ల, ఫైనల్ తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో ఎవరు ట్రోఫీని ప్రదానం చేస్తారు.! ఎవరు స్వీకరిస్తారు.! అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *